అన్వేషించండి

కార్యకర్తల భేటీలో బండి సంజయ్‌ భావోద్వేగం - తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఖాయమైనట్టేగా!

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ పరోక్షంగా అంగీకరించారు. ఆదివారం ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. దక్షిణాదిలో మళ్లీ పాగా వేయలాంటే ఇదొక్కటే మార్గంగా భావిస్తున్న బీజేపీ తెలంగాణ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది. అధ్యక్షుడిని మొదలు కొని అన్ని విభాగాలను ప్రక్షాళన దిశగా ఆలోచిస్తోంది. 

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ పరోక్షంగా అంగీకరించారు. ఆదివారం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

ఈ నెల 8న ప్రధాని మోదీ తెలంగాణ రానున్నారు. హన్మకొండలో 'విజయ సంకల్ప సభ' నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చిచేందుకు నాయకులు, శ్రేణులతో బండి సంజయ్ హన్మకొండలో సమవేశమయ్యారు. 15 లక్షల మంది జనసమీకరణే లక్ష్యంగా బహిరంగ సభను నిర్వహించి ఓరుగల్లును, పోరుగల్లుగా మార్చి చరిత్ర సృష్టిద్దామన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

హన్మకొండలో జరిగే నరేంద్ర మోదీ సభకు తాను బీజేపీ అధ్యక్షుడి హోదాలో వస్తానో రానో అంటూ భావోద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్‌ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ బీజేపీ విస్తరించిందని...ఆయన పోరాటాల వల్లే పటిష్టమైందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోదార్యమని.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనన్నారు. 

బిజెపికి త్యాగాల చరిత్ర ఉందన్నారు బండి సంజయ్‌. కార్యకర్తలెందరో జైలు పాలయ్యారని గుర్తు చేశారు. పవిత్రమైన గడ్డకు, ప్రపంచమే ది బాస్ అంటూ కీర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్న వేళ కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికి చరిత్ర సృష్టిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేద్దామన్నారు. 

ఎప్పటి నుంచో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను తప్పించి ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి పగ్గాలు ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి కానీ, జాతీయ కార్యవర్గంలో స్థానం గానీ కల్పించబోతున్నారని సమాచారం. ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా బండి సంజయ్‌్ ఎమోషన్ కావడం బీజేపీలో కూడా కొత్త  చర్చ మొదలైంది. అందుకే తమకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని బీజేపీ నాయకులు కూడా డిసైడ్ అయ్యారు.

Also Read: కాంగ్రెస్‌లో ఐక్యత - బీజేపీలో ముసలం ! తెలంగాణ రాజకీయాల్లో ఇదే గేమ్ ఛేంజరా ?

Also Read: తెలంగాణ బీజేపీని హైకమాండ్ ముంచుతుందా ? తేలుస్తుందా ?

                                                        Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Hyderabad News: భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Embed widget