Top Headlines Today: ఢిల్లీ ధర్నాలో ఏపీ ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు, బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందా ?- నేటి టాప్ న్యూస్
AP Budget Session on 24 July 2024: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గా సెషన్ కొనసాగుతోంది.
Telangana Budget Sessions - రెడ్‌బుక్‌తో రెచ్చిపోతున్న చంద్రబాబు సర్కారు- ఢిల్లీ ధర్నాలో జగన్ ఆరోపణలు- మద్దతు ప్రకటించిన అఖిలేష్
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో కొన్ని రోజుల నుంచి ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని విధ్వంసానికి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపిస్తూ ఢిల్లీ ధర్నా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాకు ముందు మీడియాతో జగన్ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్లారా చూడాలంటూ రిక్వస్ట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
"తల్లికి వందనం" స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్- ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందీ అర్హులే
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో ఒకటైన తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై శాసనమండలిలో ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక విషయాలు వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని లోకేష్ ప్రకటించారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడ చదివినా పథకానికి అర్హులేనన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందా ? బీజేపీపై వ్యూహాత్మకంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారా ?
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి పద్దును నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. సహజంగానే బడ్జెట్ ప్రకటన తర్వాత తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రాలు గళమెత్తుతూ ఉంటాయి. కేటాయింపులు చేయలేదని విమర్శలు చేస్తూ ఉంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఎలాంటి విమర్శలు రావు కానీ.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట మాత్రం తప్పనిసరిగా ఇలాంటి విమర్శలు వస్తాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రైతుల నష్టాల, కష్టాలు తెలుసుకునేందుకు సాహసం - నడుంలోతు నీళ్లున్న పొలంలోకి దిగిన షర్మిల
భారీ వర్షాలతో ఏపీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలు తెలుసుకునేందుకు వెళ్లిన షర్మిల సాహసం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగారు. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు సాయం చేయాలనన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నేనున్నా - విద్యార్థిని మధులతకు సీఎం రేవంత్ అభయం ! వెంటనే ఆర్థిక సాయం
సీఎం రేవంత్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల విషయంలో చురుగ్గా స్పందిస్తున్నారు. తాజాగా మధులత అనే విద్యార్థిని ఐఐటీ - జేఈఈలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ వెంటనే నిధులు విడుదల చేశారు. పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు మధులతకు రేవంత్ అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి