PM Modi in Lok Sabha: 'వచ్చే 100 ఏళ్లు అధికారం మాదే.. కాంగ్రెస్‌కు ఇంకా అహంకారం పోలేదు'
లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. రాబోయే 100 ఏళ్లు కూడా అధికారంలో తామే ఉంటామన్నారు.
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలపై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. అలానే కరోనా కారణంగా దేశం ఎదుర్కొంటోన్న సంక్షోభం గురించి ప్రస్తావించారు.
కాంగ్రెస్‌పై సెటైర్లు..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్‌ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
వందేళ్లు మాదే..
#WATCH | "Now that you (Congress) have made up your mind not to come to power for the next 100 years, then, 'Maine bhi tyaari kar li hai': PM Modi in Lok Sabha pic.twitter.com/3W7fJI3744
— ANI (@ANI) February 7, 2022
Also Read: UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం'