BRS Public Meeting Live Updates: దేశమంతా ఉచిత విద్యుత్, రైతు బంధు - అగ్నిపథ్ రద్దు: కేసీఆర్ కీలక హామీలు
BRS Public Meeting Live Updates: బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
LIVE
Background
BRS Public Meeting Live Updates: భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ జీవితంలో గర్జనలది కీలక పాత్ర. తెలంగాణ కోసం ఉద్యమించాలనుకున్నప్పుడు ఆయన మొదటి గర్జన పెట్టారు. తన పోరాటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే పద్దతిలో జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి భారత సింహ గర్జనతో ఖమ్మం నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ తరహాలో సక్సెస్ అవుతారో లేదో కాలం నిర్ణయిస్తుంది కానీ.. దేశాన్ని ఆకర్షించే బహిరంగసభలు నిర్వహించడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందుంటారు.
గర్జన సభలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కేసీఆర్
భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో కేసీఆర్ ది అందే వేసిన చేయి. తెలంగాణ ఉద్యమానికి ఊపు బహిరంగసభల ద్వారానే వచ్చింది. ఇదే స్ఫూర్తితో టీ-ఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధం య్య్యారు. 2001లో కరీంనగర్ సింహగర్జన మొదలు 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహా గర్జన వరకు విజయవంతమైన అనేక బహిరంగ సభలు కేసీఆర్ ఉద్యమ స్పూర్తిని రెట్టింపు చేశాయి. టీ-ఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక ఖమ్మం గడ్డపై బుధవారం నిర్వహించే బహిరంగ సభను దేశం ఆకర్షించే విధంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి కేసీఆర్ బీఆర్‌ఎస్ శంఖారావం పూరించను న్నారు.
2001లో టీఆర్ఎస్ పెట్టిన కొద్ది రోజులకే కరీంనగర్‌లో గర్జన
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన కొద్ది రోజులకే 2001 ఏప్రిల్ 27న కరీంనగర్‌లో పార్టీ ఆవిర్భావ సభ, ఆ తర్వాత హన్మకొండలో నిర్వహించిన మరో బహిరంగ సభ ఉద్యమ వేడి పెంచింది. అది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయం. ఎన్నికల్లో విజయాలు సాధించి తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షను వెలుగెత్తి చాటారు. అలాగే 2003లో వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభ తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా చేసిందని చెబుతారు. వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డి పేటలో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన బహిరంగసభ రికార్డు సృష్టించింది.
టీఆర్ఎస్ ఆవిర్భావం.. బీఆర్ఎస్ ఆవిర్భావం !
2001లో టీ-ఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత కరీంనగర్‌లో నిర్వహించిన ‘సింహ గర్జన’ బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో.. అదే రీతిలో ఖమ్మంలో ‘భారతగర్జన’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి కేసీఆర్ జాతీయ నాయకుడిగా చర్చల్లో ఉండాలని భావిస్తున్నారు. నాడు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఎత్తిచూపి, ఇక్కడి ప్రజల అవసరాలు, సాధించాల్సిన లక్ష్యాలను వెల్లడిస్తూ ఉవ్వెత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. అదే పంథాతో నేడు దేశ ప్రజల అవసరాలు, సంపద సృష్టించే మార్గాలు, రైతు సంక్షేమంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి మరో ప్రజా ఉద్యమానికి బీజం వస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత తొలి బహిరంగ సభ ద్వారా దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్ కదన శంఖారావం పూరించనున్నారు. మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక కాబోతున్నదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా ?
విపక్షాల తరపున కేసీఆర్ ప్రధాని అభ్యర్థిగా ఖమ్మం సభ తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. అయితే కేసీఆర్ కన్నా బలమైన ప్రాంతీయ పార్టీల నేతలయిన కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లాంటి వారు ఉండగా.. కేసీఆర్ ను ఎందుకు ప్రకటిస్తారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు . కానీ బీజేపీపై యుద్ధం చేయడంలో కేసీఆర్ అందరి కన్నా ముందు ఉన్నారని.బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
దేశమంతా ఉచిత విద్యుత్, రైతు బంధు - అగ్నిపథ్ రద్దు: కేసీఆర్ కీలక హామీలు
కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటే... దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రైతు బంధు పథకాన్ని కూడా దేశం మొత్తం అమలు చేస్తామన్నారు. ఖమ్మంలో నిర్వహించిన్ బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కేసీఆర్ కీలక హామీలు ఇచ్చారు. దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందని.. అమలు చేయకపోతే.. తాము వచ్చిన తరవాత అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహిళలను ప్రోత్సహించిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. 35 శాతం రిజర్వేషన్ బీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తోందని తెలిపారు. విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామంటున్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయబోమని.. ఒక వేళ అమ్మినా మళ్లీ తాము వచ్చిన తర్వాత జాతీయం చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్‌ను బలపరిస్తే మంచి భవిష్యత్
బీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయిందన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. సైన్యంలో వేలు పెట్టి తెలివితక్కువ విధానంతో వచ్చిన ఈ విధానాన్ని రద్దు చేస్తాం. పాత పద్దతిలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయని ప్రకటించారు. ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమని ఎల్ఐసీని కూడా అమ్ముతామంటున్నారని.. తాము వచ్చాక ఎల్‌ఐసీని జాతీయం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్తే మేం అధికారంలోకి వస్తున్నామన్నారు. ఎల్‌ఐసీ మిత్రులారా బీఆర్‌ఎస్‌ను బలపరచండని పిలుపునిచ్చారు. విద్యుత్ డిస్కమ్‌లు అప్పనంగా షావుకార్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ కార్మికులారా పిడికిలి ఎత్తి బీఆర్‌ఎస్‌ను బలపరచండీ... విద్యుత్‌ను పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచుకుందామని హామీ ఇచ్చారు.
అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: కేసీఆర్
దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. మహిళలను ప్రోత్సహించిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. 35 శాతం రిజర్వేషన్ బీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తోంది. విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామంటున్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో పోవ్వబోం. మళ్లీ జాతీయం చేస్తాం.
విపక్ష ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీళ్లను అందిస్తాం. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది. అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం. సైన్యంలో వేలు పెట్టి తెలివితక్కువ విధానంతో వచ్చిన ఈ విధానాన్ని రద్దు చేస్తాం. పాత పద్దతిలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయి.
ఎల్‌ఐసీ కోసం పోరడతాం: కేసీఆర్
ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం. మోదీ... మీ పాలసీ ప్రైవేటైజేషన్... మాది నేషనలైజేషన్.. ఇవాళ ఎల్‌ఐసీ అమ్ముతా అంటున్నావ్.... అమ్మేసే... పర్వాలేదు.. మేం వస్తే ఎల్‌ఐసీని జాతీయం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్తే మేం అధికారంలోకి వస్తున్నాం. ఎల్‌ఐసీ అమ్మినా... మేం వాపస్ తీసుకుంటాం. ఎల్‌ఐసీ మిత్రులారా బీఆర్‌ఎస్‌ను బలపరచండీ.. మన ఎల్‌ఐసీని వెనక్కి తీసుకుందాం. విద్యుత్ డిస్కమ్‌లు అప్పనంగా షావుకార్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ కార్మికులారా పిడికిలి ఎత్తి బీఆర్‌ఎస్‌ను బలపరచండీ... విద్యుత్‌ను పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచుకుందాం. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత్ దేశంలో మంచినీళ్లు ఇవ్వలేని పాలకులు కావాలా... కరెంటు ఇవ్వలేరు.. మంచి నీళ్లు ఇవ్వలేరు. వీళ్ల మాటలు నమ్మి ఎదుకు మోసపోవాలి. అవసరమైన చోట పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిందే.
బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్: కేసీఆర్
కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే. బీజేపీ ఉంటే కాంగ్రెస్‌ను కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడమే వారి పాలన. విద్యుత్‌కు ఏమైందీ... ఈ దేశంలో అందుబాటులోఉన్న విద్యుత్ 4లక్షల పదివేల మెగావాట్లు. ఏరోజు కూడా రెండు లక్షల పదివేల మెగావాట్లకు మించి వాడలేదు. అనేక థర్మల్ పవర్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే... స్ట్రేషర్ అసెట్స్ అని పేరు పెట్టి ఎన్సీఎల్టీ పంచాయితీ పెట్టి వాటిని మూలకు పెట్టి కూర్చున్నారు. దేశమంతటా ఇవాళ కరెంటు కోతలతో ఇబ్బంది పడుతోంది. ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే వెలుగుజిలుగు భారతాన్ని తయారు చేస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే... రేవ్డీ కల్చర్ అని రైతులను అవమాన పరుస్తున్నారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి సిగ్గుపడాలి. రైతులు ధర్నాలు చేస్తే దుస్థితా ఇది. ఇదేనా పాలించే విధానం. దేశానికి కావాల్సింది ఇదేనా. ఇష్టం ఉన్న వాళ్లకు దోచి పెట్డడానికి యత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి. రేపు బీఆర్‌ఎస్ ప్రతిపాదించే ప్రభుత్వం వస్తే.. దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు ఇస్తాం. - కేసీఆర్, తెలంగాణ సీఎం
ఆ ప్రశ్నే నా మదిని కలచి వేస్తోంది?: కేసీఆర్
ఒకే మాట నా మనసు కలచి వేస్తోంది. ఇవాళ భారత్ సమాజం లక్ష్యం ఏంటి? ఏమైనా ఉందా... భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయిందా... దారి తప్పిందా.. దేశంలో ఏం జరుగుతోంది. ఇది అనేక రోజులుగా నన్ను కలచి వేస్తున్న ప్రశ్న. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి.. ప్రపంచ బ్యాంకు, అమెరికా, విదేశీయుల అవసరం లేని.. ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల, రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఏమవుతున్నాయి. ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలి. అమెరికా మన కంటే రెండున్నర రెట్లుపెద్దది. వాళ్లకు వ్యవసాయ భూముల శాతం 29శాతం. చైనా వాళ్లకు వ్యవసాయ భూమి 16 శాతమే. మన దేశంలో యాభై శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉంది. పుష్కలంగా ఉన్న నీటి వనరులను కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. అద్భుతమైన సూర్య కాంతి మనకు అందుబాటులో ఉంది. మూడు ఆగ్రో క్లైమెటిక్ జోన్స్ ఉన్నాయి. ఆపిల్ కూడా పండుతుంది. మామిడి కూడా పండుతుంది. ఇదే వేరే దేశాల్లో లేదు. కష్టపడి పని చేసే మంచి మానవవనర్లు ఉన్నాయి. ఇలాంటి దేశంలో మెక్‌డొనాల్డ్ ఫుడ్డా మనం తినేది. ఇలాంటి దేశంలో కెనాడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటామా... ఇది మన విధానామా..
దీనికి ఎవరు బాధ్యతులు. ఎక్కడ మనం మోసపోతున్నాం. మన నీళ్లన్నీ సరైన పాలన వచ్చి నీళ్లన్నీ పొలాల దాహం తీర్చాలా... ఇలానే ఉండాల అనేది ప్రశ్నించుకోవాలి. ఇది సాధించడానికే పుట్టింది బీఆర్ఎస్.