Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Background
రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి
మాస్కో: రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిచెందారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ(47) జైలులో శుక్రవారం మృతిచెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్, ఎం.రమేశ్‌లను ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.





















