Breaking News: BRS విలీన వార్తలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్- చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిక
Andhra Pradesh And Telangana Breaking News: బంగ్లాదేశ్‌లో పరిణామాలు, ఒలింపిక్స్ అప్‌డేట్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాల రాజకీయలకు సంబంధించిన మరిన్ని వార్తలు తక్షణం తెలుసుకునేందుకు ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి
LIVE
Background
బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిణామాలతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 5న దేశం విడిచి పెట్టి వచ్చేశారు. ఆమె ప్రస్తుతానికి భారతదేశంలో తలదాచుకుంటున్నారు. ఇక్కడ ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇప్పట్లో స్వదేశానికి వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు విదేశాల్లో ఎక్కడైనా ఆశ్రయం దొరికే వరకు భారత్‌లో ఉండబోతున్నట్టు సమాచారం. అందుకే ఆమెకు ఇక్కడ దీర్ఘకాలం పాటు ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.
షేక్ హసీనాకు ఎంత కాలం ఆశ్రయం ఇస్తారు.. ఆమెను కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రత వంటి వాటిపై కేంద్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజ్యసభలో మాట్లాడిన విదేశాంగ మంత్రి జైశంకర్... ఆమె చాలా ఒత్తిడిలో ఉన్నారని మాత్రమే చెప్పారు. పరిస్థితులు గమనిస్తే మాత్రం హసీనాకు భారత ప్రభుత్వం చాలా కాలం ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
77 ఏళ్ల అవామీ లీగ్ చీఫ్ హసీనా బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించారు. అయింతే అక్కడి నిబంధలు అందుకు అంగీకరించబోవని బ్రిటన్ ప్రభుత్వం చెప్పడంతో ఆమె ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు. ఐరోపా దేశాల్లో తలదాచుకునేందుకు భారత్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో దేశం ఓకే చెప్పే వరకు ఆమె భారత్‌లోనే ఉండబోతున్నారు.
ఆమెకు వేరే దేశంలో ఉండేందుకు అనుమతి లభించే వరకు ఆమెను వేరే సురక్షిత ప్రాంతానికి తరలించాని భారత్ భావిస్తోంది. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి లేదా దేశాధినేతగా ఉండటానికి అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను ఆమెకు అందిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఏదైనా యూరోపియన్ దేశంలో ఆశ్రయం పొందే విషయంలో కూడా ఆయన చొరవ తీసుకుంటున్నారని సమాచారం.
షేక్ హసీనా భారత్‌లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉన్నందున హిండన్ ఎయిర్‌బేస్ నుంచి వైమానిక దళం, భద్రతా సంస్థలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని వర్గాలు తెలిపాయి. షేక్ హసీనా అంతర్గత భద్రత కోసం భారీగా బలగాలు మోహరించాయి. వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండోలు బయట నుంచి భద్రతను పర్యవేక్షిస్తోంది.
Telangana: తెలంగాణలో మరో ఉప ఎన్నిక- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం
Telangana: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ నుంచి ఈ మధ్యే ఖాళీ అయిన స్థానం కూడా ఉంది. బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న కే. కేశవరావు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది.
BRS: విలీనం పుకార్లపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్- చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిక
KTR: హిడెన్ అజెండాతో నిరాధారమైన కథనాలు రాసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పుకార్లు వ్యాప్తి చేసే వారికి ఇదే చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. BRSకి వ్యతిరేకంగా ప్రమాదకరమైన అబద్ధాలకు తమ వివరణ కూడా తీసుకోవాలని సూచించారు. లేకుండే తప్పుడు జరిగిందని ప్రకటించాలని సూచించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తూ ఉందని ఇకపై కూడా సేవలు చేస్తామన్నారు. పడతాం... లేస్తాం... పోరాడేది మాత్రమే తెలంగాణ కోసమేనన్నారు. తాము ఎన్నటికీ తలవంచమమని తమ నినాదం జై తెలంగాణయే అన్నారు.
Vinesh Phogat Disqualified: ఆసుపత్రిలో చేరిన వినేశ్ ఫొగాట్- బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్స్
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయం అనుకున్న టైంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే మరో షాక్ తగిలింది. బరువు తగ్గేందుకు రాత్రంతా వర్కౌట్స్ చేసిన వినేశ్ ఫొగాట్ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. నిర్విరామంగా చేసిన వర్కౌట్స్ కారణంగా ఆమె స్పృహతప్పి పడిపోయారని అంటున్నారు.
Vinesh Phogat Disqualified: ఆసుపత్రిలో చేరిన వినేశ్ ఫొగాట్- బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్స్
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయం అనుకున్న టైంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే మరో షాక్ తగిలింది. బరువు తగ్గేందుకు రాత్రంతా వర్కౌట్స్ చేసిన వినేశ్ ఫొగాట్ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. నిర్విరామంగా చేసిన వర్కౌట్స్ కారణంగా ఆమె స్పృహతప్పి పడిపోయారని అంటున్నారు.
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఆర్టీసీ బస్ ఢీ కొని ఇద్దరు మృతి
Crime News: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి ఇద్దరు మృతి చెందారు.