Breaking News:బంగ్లాదేశ్‌లో నిరసనలకు దిగొచ్చిన షేక్ హసీనా- ప్రధానమంత్రి పదవికి రాజీనామా!
Andhra Pradesh And Telangana Breaking News: ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు, ఒలింపిక్స్ అప్‌డేట్స్‌తోపాటు మరిన్ని వార్తలు తక్షణం తెలుసుకునేందుకు ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి
LIVE
Background
Breaking News In India Today in Telugu: ఇవాళ జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగుతున్న తొలి సమావేశం కావడంతో అందరి దృష్టీ ఈ భేటీపై ఉంది. పాలనకు సంబంధించిన విషయాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. గత ఐదేళ్లుగా పాలనలో నిస్తేజం వచ్చిందని ఇప్పటికే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఎలా పని చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. అందుకే ఈ సమావేశం తర్వాత కచ్చితంగా పాలనలో మార్పు కనిపిస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన పాలనాపరమైన లోపాలు గుర్తించిన చంద్రబాబు... అవి రిపీట్ కాకుండా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగానికి సూచనలు చేయనున్నారు. భూకబ్జాలు, ఇతర దోపిడీలకు అడ్డుకట్ట పడేలా పలు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు దోపిడీ చేసిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
మరోవైపు ప్రజాదర్బారు పేరుతో మంత్రులు, సీఎం ప్రజల నుంచి తీసుకుంటున్న వినతులపై కూడా చర్చించనున్నారు. వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తారు. ఇన్నోవేటివ్ ఆలోచనతో ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పని చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలంటే... మౌలిక సదుపాయాల కల్పనలో తేడా రాకూడదని సూచించనున్నారు. అందుకు అవసరమైన చర్యలు జిల్లా స్థాయిలో తీసుకునే విషయాన్ని ప్రస్తావనకు రానుంది. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వేప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ వేగంగా చేయాలని నిర్దేశించనున్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్డ్‌గా ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే చేపట్టనుంది. ఈనెల 7 నుంచి 20 వరకు ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. స్కిల్ సెన్సస్‌పై కూడా కలెక్టర్ల అభిప్రాయలు తీసుకోనున్నారు.
వలంటీర్ల ముసుగులో అధికారిక గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. సంక్షేమ పథకాల అమలుపై కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక గ్రూప్‌లను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న వాటిపై చర్యలు సిద్ధమైంది. వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ ఆదేశాలు పంపించారు. సెలవు రోజైనా ఆదివారం ఈ ఉత్తర్వలు పంపించారు. అందరికీ ఫోన్ ద్వారా ఈ మెసేజ్ సెండ్ చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అధికారిక గ్రూప్‌లను ఇవాళ సాయంత్రం లోపు తొలగించాలని ఆ ఆదేశాల్లో శివప్రసాద్ పేర్కొన్నారు. అలాంటి గ్రూపుల్లో ఉంటే జరిగే ప్రమాదాన్ని ప్రజలకు వివరించి ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందుకున్న వారంతా ఇప్పుడు అధికారిక గ్రూపులు తొలగించే పనిలో ఉన్నారు
మార్చి 16 నుంచి ఈ వలంటీర్ వ్యవస్థ పని చేయడం లేదు. ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో వీళ్లను పక్కన పెట్టారు. వారి ఫోన్‌లు, ఇతర సామగ్రి వారి నుంచి తీసుకున్నారు అధికారులు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు వారి పై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బంగ్లాదేశ్‌లో నిరసనలకు దిగొచ్చిన షేక్ హసీనా- ప్రధానమంత్రి పదవికి రాజీనామా!
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నిరసనలకు ప్రధానమంత్రి షేక్ హసీనా దిగొచ్చారని సమాచారం. తన పదవికి కాసేపట్లో రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్‌కు బిగ్ టాస్క్ అప్పగించిన చంద్రబాబు
ఏపీలో అటవీ సంపద పెంచేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు టాస్క్ అప్పగించారు. భారీగా మొక్కలు నాటే కార్యక్రమానికి చేపట్టాలని సూచించారు. జిల్లా అధికారులతో సమావేశంలో వందరోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను అధికారులు వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.." రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. 5నుంచి 10లక్షల మెుక్కలు ఒకేసారి నాటాలి. డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ బాధ్యతతీసుకోవాలి. అప్పట్లో హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం వనభోజనానికి వెళ్దామని. ప్రతిపాదించారు.
ఫుడ్ హ్యాబిట్స్‌తోపాటు ప్రోడెక్షన్ హ్యాబిట్స్ కూడా మారాలి. 20లక్షల హెక్టారుల్లో ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీకి డిమాండ్ ఉంది. భూసార పరీక్షలు పెంచాలి. ప్రతి రంగంలో కూాడ సాంకేతికత ఉపయోగించుకోవాలి." అని చెప్పారు
అబుదాబిలో తిండి లేక తిప్పలు పడుతున్న మండపేట మహిళ- ఇండియా రప్పించాలని వేడుకోలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి దుబాయ్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. ఓ సెల్ఫీ వీడియో పెట్టి తనను స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. కుటుంబ ఆర్ధిక ఇబ్బందులతో తాను అబుదాబిలో ఇరుక్కుపోయానని అన్నారు. ఒక ఏజెంట్ ద్వారా నాలుగు నెలల క్రితం వచ్చిన తనకు తిండీ తిప్పలు లేవనివాపోయారు. పి.గన్నవరానికి చెందిన ఓ వ్యక్తి తనను అరబ్ షేక్ ఇంట్లో పనికి కుదిర్చారని చెప్పారు. వచ్చినప్పటి నుంచి సరైన తిండి లేక నీరు,వసతి లేదని చెప్పారు. ఆరోగ్యం కూడా క్షీణించిందని వివరించారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా యజమాని పని చేయిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం- అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్: చంద్రబాబు
ఎన్నికల్లో కూటమి తరఫున ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ... వంద రోజుల టార్గెట్‌గా పనులు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ విజయన్ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేస్తామన్నారు.