Breaking News: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం- పెయింట్స్ కంపెనీలో ఎగసిపడుతున్న మంటలు
Breaking News: దేశవ్యాప్తంగా ప్రజలు గురువారం (ఆగస్టు 15) 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి దేశ ప్రజలకు ప్రధాని మోదీ సందేశాన్ని ఇవ్వనున్నారు.
LIVE
Background
Andhra Pradesh Telangana Breaking News: భారత దేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవం గురువారం (ఆగస్టు 15) జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2024 ఆగస్టు 15న ఉదయం 7.30 గంటలకు చారిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోటలపై నుంచి వరసుగా 11వసారి ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతి ఉద్దేశించి చేస్తున్న మొదటి ప్రసంగం.
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం (12 ఆగస్టు 2024) నుంచే ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అణలులోకి వచ్చాయి. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో రూట్లు డైవర్ట్ చేశారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా నిషేధించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఆగస్ట్ 15 ఉదయం 4 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి అన్ని లైన్లలో రైలు కార్యకలాపాలు ప్రారంభించింది.
ఎర్రకోటలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు పంచాయతీరాజ్ సంస్థలకు చెందిన 400 మంది మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా కేంద్రం ఆహ్వానించింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు దాదాపు 45 మంది 'లఖపతి దీదీ', దాదాపు 30 'డ్రోన్ దీదీ'లను కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ వ్యూహాత్మక ప్రాంతాల్లో మొత్తం 681 మంది బలగాలు మోహరించారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం థీమ్ 'అభివృద్ధి చెందిన భారతదేశం @2047' అనే పేరుతో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి మొత్తం 2,000 మంది బాల బాలికల క్యాడెట్లు వేడుకలో పాల్గొంటున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం- పెయింట్స్ కంపెనీలో ఎగసిపడుతున్న మంటలు
Telangana: హైదరాబాద్‌లోని అంబర్‌పేట అలీకేఫ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న ఓ పెయింట్స్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో కొందరు మహిళలు గాయపడినట్టుతెలుస్తోంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా మంటల్లో పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పుతోంది.
Independence Day Celebrations: భావితరాలకు అండగా ఉంటాం: పవన్
Independence Day Celebrations: స్వాతంత్య్ర సమగ్రత స్ఫూర్తి నింపేలా ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంటుంది. భావి తరాల కోసం అండగా నిలబడతాం. దేశ సంపద అయిన యువత కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం.
Independence Day Celebrations: తెలంగాణలో వేడుకగా ఆగస్టు 15 వేడుకలు- పరేడ్ గ్రౌండ్‌కు బయల్దేరిన రేవంత్ రెడ్డి
Independence Day Celebrations: పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా తన నివాసంలో జాతీయ జెండాను ఎగరేసిన సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించి సాయుధల బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు.
Independence Day Celebrations: కాకినాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్
Independence Day Celebrations:కాకినాడలో కూడా స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవం - జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు మువ్వెన్నల జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాలను గౌరవ వందనం స్వీకరించారు.