Bangladesh: కుర్రాళ్లు సాధించారు, బంగ్లాదేశ్ సంక్షోభంపై మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Bangladesh News: బంగ్లాదేశ్ అల్లర్లపై మాజీ ప్రధాని ఖలీదా జియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్రాళ్లంతా కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని అన్నారు.
Bangladesh Crisis News Updates: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్రాళ్లంతా కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ ప్రశంసలు కురిపించారు. షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు ఆమె దేశం నుంచి పారిపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్‌కి మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్టుగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి హాస్పిటల్‌లో ఉన్న ఆమె బెడ్‌పై నుంచే మాట్లాడి ఓ వీడియో విడుదల చేశారు. ఇకపై ప్రజాస్వామ్యమైన బంగ్లాదేశ్‌ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు ఖలీదా జియా. అన్ని మతాలనూ గౌరవించుకోవాలని సూచించారు. యువతకు మేలు చేసే విధంగా కొత్త బంగ్లాదేశ్‌ని నిర్మించుకోవాలని అన్నారు. మైనార్టీలపై జరిగే దాడులను ఖండించారు.
"ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంతో కూడిన బంగ్లాదేశ్‌ని నిర్మించుకోవాలి. అన్ని మతాల వాళ్లనూ గౌరవించుకోవాలి. యువత, విద్యార్థులే ఈ కలను సాకారం చేస్తారు. శాంతియుత వాతావరణం నెలకొల్పినప్పుడే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విద్వేషాలకు, హింసకు తావులేదు"
- ఖలిదా జియా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
దాదాపు ఆరున్నరేళ్లుగా జైల్లోనే ఉన్నారు ఖలీదా జియా. అల్లా ఆశీస్సులతో తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఫాసిస్ట్ ప్రభుత్వం నుంచి మనకు విముక్తి లభించిందని వెల్లడించారు. ఈ పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన వాళ్లందరికీ జోహార్‌లు చెప్పారు. మైనార్టీలపైన దాడులను తీవ్రంగా ఖండించిన ఖలీదా వెంటనే ఈ హింసను ఆపేయాలని పిలుపునిచ్చారు. ఇకపై పంతాలు ప్రతీకారాలు లేని బంగ్లాదేశ్‌ని నిర్మించుకుందామని అన్నారు. (Also Read: Vinesh Phogat Replacement: రెజ్లింగ్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ స్థానంలో ఆమెకు ఛాన్స్, షెడ్యూల్ విడుదల చేసిన నిర్వాహకులు)
Begum Khaleda Zia came out of Jail, but she looks in bad shape - Seems the so called interim Govt led by American Nobel laureate Muhammad Yunus is here to stay! #Bangladesh pic.twitter.com/MduqFIH71f
— Mihir Jha (@MihirkJha) August 7, 2024
ఖలీదా జియా భర్త జియరా రహమాన్ 1977 నుంచి 1981 వరకూ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1981లో ఆయన హత్యకు గురయ్యారు. 1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆ తరవాత 1996లోనూ పోటీ చేసి గెలిచారు. 12 రోజులు మాత్రమే ఆమె ప్రభుత్వం నిలబడింది. ఆ సమయంలోనే షేక్ హసీనా పోటీ చేసి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల తరవాత మళ్లీ పోటీ చేసి గెలిచారు ఖలీదా జియా. కానీ 2006లో ఆమెపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల అరెస్ట్ అయ్యారు. 2018లో ఆమె అవినీతి కేసుల్లో దోషిగా తేలారు. ఫలితంగా 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. షేక్ హసీనా కుట్ర చేసిన తనపై ఈ నిందలు మోపారని విమర్శించారు ఖలీదా జియా. ఇప్పుడు షేక్ హసీనా అధికారం కోల్పోవడం వల్ల వెంటనే ఖలీదా జైల్లో నుంచి విడుదలయ్యారు.
Also Read: Vinesh Phogat: రెజ్లర్లు బరువు ఎందుకు తగ్గాలి? వెయిట్ విషయంలో ఎందుకింత కచ్చితంగా ఉంటారు?