Bill Gates Gets Notice: సీరమ్ కంపెనీ రూ.1000 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే, బాంబే హైకోర్ట్‌లో ఓ తండ్రి పిటిషన్ - ఏమైందంటే?
Bill Gates Gets Notice: కొవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే తన కూతురు మృతి చెందిందని ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు.
Bill Gates Gets Notice:
వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేశారు: పిటిషనర్
కొవిషీల్డ్ టీకా తీసుకున్నాక ఆ సైడ్ ఎఫెక్ట్స్‌తో తన కూతురు మృతి చెందిందంటూ ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌పై పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు ఆ టీకాను ప్రమోట్ చేసిన బిల్‌గేట్స్ పేరునీ జోడించాడు. తన కూతుకు మృతికి బాధ్యత వహిస్తూ...దీనిపై కచ్చితంగా స్పందించాలని అందులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన బాంబే హై కోర్టు...వివరణ ఇవ్వాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు, బిల్‌గేట్స్‌కు నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని ఆదేశించింది. కంపెనీ తనకు రూ.1000 కోట్ల పరిహారం అందించాలని పిటిషనర్ దిలీప్ లునావత్ డిమాండ్ చేస్తున్నాడు. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం తప్పుడు ప్రచారం చేసిందని సేఫ్టీ గురించి ఆలోచించలేదని మండి పడ్డాడు. మెడికల్ ప్రాక్టీషనర్స్ వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేశారనిఆరోపించాడు. ఔరంగాబాద్ వాసి అయిన దిలీప్..తన కూతురు స్నేహల్ లునావత్ మెడికల్ స్టూడెంట్ అని చెప్పాడు. జనవరి 28న నాసిక్‌లోని తన కాలేజీలో ఆమెను వ్యాక్సిన్ తీసుకోవాలని ఒత్తిడి చేశారని అన్నాడు. స్నేహల్ SMBT కాలేజీలో డాక్టర్‌గా, సీనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్నట్టు పీటీఐ పేర్కొంది.
Bombay HC issues notice to Government of India, Serum Institute, Bill Gates, AIIMS director, DCGI chief & others on a petition filed by a man named Dilip Lunawat seeking Rs 1000 crore as compensation for the death of his daughter Dr Snehal Lunawat after taking Covishield vaccine
— ANI (@ANI) September 3, 2022
సైడ్ ఎఫెక్ట్స్ వల్లే మృతి: పిటిషనర్
ఆమె కొవిషీల్డ్ తీసుకున్న కొద్ది రోజులకు విపరీతమైన తలనొప్పి, వాంతులతో బాధ పడింది. ఆరోగ్యం విషమించటం వల్ల ఆసుపత్రిలో చేరింది. టెస్ట్ చేసిన వైద్యులు...మెదడులో రక్తస్రావం అవుతోందని గుర్తించారని..పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్చి1 న బాధితురాలు మృతి చెందింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తోనే ఇలా జరిగిందని పిటిషనర్ ఆరోపిస్తున్నాడు. దీనిపై బిల్‌గేట్స్ కూడా స్పందించాలని పిటిషనర్ డిమాండ్ చేస్తున్నాడు. కొవిషీల్డ్ తయారీకి సహకరించిన బిల్ అండ్ మిలింద గేట్స్ సంస్థ..కూడా ఇందుకు బాధ్యత వహించాలని అంటున్నాడు పిటిషనర్. 100 మిలియన్ డోస్‌ల కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసేందుకు సీరమ్‌కు బిల్ అండ్ మిలింద సంస్థ సాయం చేసింది. కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలని పిటిషనర్ అడుగుతున్నాడు.
In his petition, Dilip Lunawat blames Government and others for misrepresenting the facts about the COVID vaccine by making false claims about its safety & 'Forcing' Medical practitioners to take the vaccine
— ANI (@ANI) September 3, 2022
Also Read: KCR Politics : తెలంగాణ బాధితులకు కేసీఆర్ ఓదార్పు అసాధ్యమా ? సొంత ప్రజలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా ?