Delivery in Thar: కార్లలో వచ్చి ఉప్పులు, పప్పుల డెలివరీ - ఈ వీడియోను చూసి నమ్మాల్సిందే !
Thar Car: గిగ్ వర్కర్లు బైకుల మీద తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కార్లకు అప్ గ్రేడ్ అవుతున్నారు. ఏకంగా థార్ కార్‌లో డెలివరీ చేస్తున్న ఓ గిగ్ వర్క్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Blinkit agent delivered an order in Thar Car: భారతదేశంలో క్విక్-కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ ఒకరు, సాధారణంగా బైక్ లేదా సైకిల్‌లో వచ్చే స్థానంలో మహీంద్రా థార్ SUVలో వచ్చి డెలివరీ అందించారు. ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. "బ్లింకిట్ డెలివరీ బాయ్‌లకు ఇంత జీతం ఇస్తున్నారా? లేక మహీంద్రా థార్‌ను చీప్ ప్రైస్‌లో ఇస్తున్నారా?" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది.
బాల్కనీ నుంచి రికార్డ్ చేసిన ఈ క్లిప్‌లో, బ్లాక్ మహీంద్రా తార్ SUV ఒక ఇంటి ముందు ఆగుతుంది. డెలివరీ ఏజెంట్ తార్‌లోంచి దిగి, గ్రాసరీ పార్సెల్‌ను కస్టమర్‌కు అందజేసి, మళ్లీ కారులోకి వెళ్తూ కనిపిస్తాడు. వీడియోలో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి ఆశ్చర్యంగా చెబుతూ, "భాయ్, ఈ తార్‌లోనే బ్లింకిట్ డెలివరీ వచ్చాడు! చూస్తున్నావా?" అని అన్నాడు. కస్టమర్లు కూడా ఆశ్చర్యపోతూ, "భాయ్, యే థార్ మెయిన్ డెలివరీ కర్నే ఆయా హై!" (అతను తార్‌లోనే డెలివరీకి వచ్చాడు!) అని చెబుతున్న ఆడియోలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram
బ్లింకిట్, జోమాటో గిగ్ వర్కర్లు సాధారణంగా ట్రాఫిక్‌లో సులభంగా వెళ్లడానికి బైక్‌లు లేదా సైకిళ్లను ఉపయోగిస్తారు. ఈ SUV డెలివరీ అసాధారణంగా ఉండటంతో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్ EMI చెల్లించలేక డెలివరీ చేస్తున్నాడేమో అని కొంత మంది జోక్ వేశారు. "బ్లింకిట్ ప్రీమియం వెర్షన్" అని పిలుస్తూ మరొకరు, "నేను ఒకసారి మహీంద్రా స్కార్పియో ఓనర్ నుంచి డెలివరీ పొందాను" అని తన అనుభవాన్ని షేర్ చేశారు.
A Blinkit agent delivered an order in a Mahindra Thar, leaving netizens amused and the video viral.
— NewsBreak24 (@NewsBreak24Live) September 18, 2025
.
.
.
.#Blinkit #MahindraThar #ViralVideo #DeliveryGoals #TrendingNow #LuxuryRide #InternetBuzz pic.twitter.com/bMYgq4nLOd
ఈ వీడియో వైరల్ కావడంతో, బ్లింకిట్ ఫ్రాంచైజీ ప్రోగ్రాం, డెలివరీ బాయ్‌ల జీతాలు, క్విక్-కామర్స్ ఇండస్ట్రీలోని ఆసక్తికరమైన అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి. బ్లింకిట్ అధికారులు ఇంకా ఈ వీడియోపై స్పందించలేదు. ఈ ఘటన భారతదేశంలో క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పాపులారిటీని, డెలివరీ ఏజెంట్ల జీవితాలను మరోసారి హైలైట్ చేసింది.
ब्लैक रंग की चमचमाती थार से ऑर्डर लेकर पहुंचा Blinkit डिलीवरी बॉय
— Article19 India (@Article19_India) September 19, 2025
सोशल मीडिया पर वीडियो हो रहा वायरल ! pic.twitter.com/6ARk4S0YYD





















