Pak Air Force: సొంత ప్రజలపైనే బాంబులేస్తున్న పాక్ ఎయిర్ ఫోర్స్ - ఉగ్రవాదులనే ముద్ర - వినాశనమే !
Pakistan: పాకిస్తాన్ వినాశనానికి దగ్గర దారిలో ఉంది. సొంత ప్రజలపై మిలిటెంట్లు అనే ముద్ర వేసి సైన్యంతో బాంబులు వేయించింది.

Pakistan is bombing its own people: పాకిస్తాన్ వాయుసేన ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతంలోని ఓ గ్రామంపై రాత్రి 2 గంటల సమయంలో 8 బాంబులు వేసింది. ఫలితంగా కనీసం 30 మంది పౌరులు చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అటాక్‌ను ఖండించకపోగా .. ఇది ఉగ్రవాద శిబిరాలపై దాడిగా చెప్పుకుంది.
పౌరులపై దాడులు చేయడానికి పాక్ ఎయిర్ ఫోర్స్ జెఎఫ్-17 ఫైటర్ జెట్‌లను ఉపయోగిచింది. వాటి ద్వారా చైనా తయారు ఎల్‌ఎస్-6 ప్రెసిషన్ గ్లైడ్ బాంబులు ప్రయోగించారు. రాత్రి 2 గంటల సమయంలో గ్రామంలో నిద్రలో ఉన్న కుటుంబాలపై ఈ బాంబులు పడ్డాయి. స్థానిక మీడియా ప్రకారం, గ్రామం శవాలతో, శిథిలాలతో నిండిపోయింది. ఇళ్లు కూలిపోయి, పశువులు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. గాయపడినవారి సంఖ్య స్పష్టంగా తెలియకపోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని రిపోర్టులు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో విధ్వంసం ఫోటోలు వైరల్ అయ్యాయి..
Shocking news coming out of Pakistan.. 30 Killed, including infants, in Khyber Pakhtunkhwa as
— barkha dutt (@BDUTT) September 22, 2025
Pakistan airstrikes hit KPK village with 8 bombs https://t.co/YGMEroRTC6
ఈ దాడిని ఖండించని పాక్ ప్రభుత్వం ఈ అటాక్‌లో తమ పాత్ర లేదని చెబుతోంది. కానీ వాయిసేన దాడి చేసిందని దొరికిన ఆధారాల గురించి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. వాయుసేన దాడి చేసిన ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి సంస్థలు ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 13-14 తేదీల్లో ఈ ప్రాంతంలో జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ఘటనల్లో 31 మంది టీటీపీ ఉగ్రవాదులు మరణించారు. ఈ ఏటా జనవరిలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు 42 శాతం పెరిగాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (పిసిసిఎస్) డేటా ప్రకారం, 74 దాడుల్లో 90 మంది మరణించారు. ఖైబర్ పక్తుంఖ్వా మొదటి స్థానంలో ఉండగా.. బలూచిస్తాన్ తర్వాత రెండో స్థానంలో ఉంది.
More than 30 Pashtun civilians were slaughtered in Tirah Valley when PAF jets Chinese-supplied JF-17s carrying LS-6 bombs leveled entire villages, just 48 hours after Trump threatened Kabul over Bagram. This was not Islamabad acting independently, it was Pakistan serving U.S.… https://t.co/wpg0fZ3qKM pic.twitter.com/WoXY9sCbDF
— रुद्राक्ष📿 (Rudy) (@manamuntu) September 22, 2025
ఈ అటాక్‌లో ఎల్‌ఎస్-6 బాంబుల వాడకం కారణంగా ఇది యాదృచ్ఛికం కాకుండా ఉద్దేశపూర్వకమని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ అధికారులు ఖైబర్ పక్తుంఖ్వాలో పౌరుల రక్షణలో విఫలమయ్యారని.. ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాక్ ఆకుపైన కాశ్మీర్‌లో 9 ప్రధాన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసమయ్యాయి. దీంతో జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో కొత్త బేస్‌లు ఏర్పాటు చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెబుతున్నాయి. స్థానికులు, మానవ హక్కుల సంస్థలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్నారు.





















