H1B Visa News: H1B వీసా ఫీజు పెంపుతో అమెరికా డ్రీమ్ పోతే కెనడానే బెస్ట్? గ్రీన్ కార్డ్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
H1B వీసా ఫీజును భారీగా పెంచిన డొనాల్డ్ ట్రంప్ చాలా మంది అమెరికా వెళ్లాలనే ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో అమెరికా కాకుంటే బెస్ట్ ఏ దేశం అవుతుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో చూద్దాం.

H1B Visa News: చాలా మంది భారతీయల అమెరికా డ్రీమ్‌కు H-1B వీసా దరఖాస్తుకు 1,00,000 డాలర్ల ఫీజు ప్రధాన అడ్డంకిగా మారబోతోంది. అందుకే కేవలం 85,000 వార్షిక కోటా కారణంగా వేల మంది అధిక నైపుణ్యం ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఈ టైంలో కెనడా శాశ్వత నివాసం అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా మారే ఛాన్స్ ఉంది. అంతే కాదు అమెరికాలో కూడా పలు మార్గాల్లో ఉద్యోగాలు చేసుకునే వీలుంది.
H-1B దరఖాస్తుదారులకు ప్రత్యామ్నాయాలు:
1. క్యాప్-మినహాయింపు H-1B: నాన్‌ప్రాఫిట్ కాలేజీలు, యూనివర్సిటీలు, లేదా ప్రభుత్వ పరిశోధనా సంస్థలు వంటి కొన్ని సంస్థలు H-1B వార్షిక కోటా నుంచి మినహాయింపు పొందుతాయి. ఇక్కడ ఉద్యోగం పొందిన వ్యక్తి, కోటాకు లోబడి ఉండే కంపెనీలో కూడా ఏకకాలంలో పార్ట్‌టైమ్ పని చేయవచ్చు.
2. L-1 ఇంట్రాకంపెనీ బదిలీలు: ఉద్యోగి తమ యూఎస్ కంపెనీ అనుబంధ సంస్థ తరఫున ఒక సంవత్సరం విదేశాల్లో పని చేసిన తర్వాత, L-1 వీసా ద్వారా అమెరికాకు తిరిగి రావడానికి అర్హులు కావచ్చు.
3. O-1 వీసా : సైన్స్, ఆర్ట్స్, విద్య లేదా వ్యాపారంలో అసాధారణమైన సామర్థ్యం నిరూపించుకున్న వ్యక్తులకు O-1 వీసా అనుకూలంగా ఉంటుంది.
4. దేశ-నిర్దిష్ట వీసాలు: ఆస్ట్రేలియా పౌరులకు E-3 వీసా, కెనడా, మెక్సికో పౌరులకు TN వీసా, చిలీ, సింగపూర్ పౌరులకు H-1B1 వీసా అందుబాటులో ఉన్నాయి. ఈ వీసాలు తక్కువ పోటీతో H-1B మాదిరిగానే ప్రొఫెషనల్ ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తాయి.
యూఎస్ గ్రీన్ కార్డ్ vs కెనడా PR:
యూఎస్ గ్రీన్ కార్డ్ పొందడం నిపుణులకు చాలా కష్టమైన, దీర్ఘకాలిక ప్రక్రియ. ఉద్యోగ-ఆధారిత గ్రీన్ కార్డులు EB-1 (అత్యుత్తమ ప్రతిభావంతులు), EB-2 (అధునాతన డిగ్రీలు), EB-3 (నైపుణ్యం కలిగిన కార్మికులు) వంటి మూడు ప్రాధాన్యత కేటగిరీలలో లభిస్తాయి. అయితే, జన్మస్థలం ఆధారంగా దేశాల వారీగా పరిమితులు ఉండటం వల్ల, భారతీయ నిపుణులు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
దీనికి భిన్నంగా, కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా PR పొందడం చాలా సులభం. దీనికి సాధారణంగా ఉద్యోగ ఆఫర్ అవసరం లేదు. వయస్సు, విద్య, భాషా ప్రావీణ్యం వంటి లక్షణాల ఆధారంగా ఆబ్జెక్టివ్ స్కోరింగ్ ఉంటుంది. దీని ద్వారా సాధారణంగా 6 నెలల నుంచి 1.5 సంవత్సరాలలోపు PR పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, H-1B లాటరీలో వైఫల్యం ఎదుర్కొన్న లేదా అధిక ఫీజులు భరించలేని ప్రతిభావంతులకు కెనడా ఒక మెరుగైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం ప్రపంచ టెక్ దిగ్గజాలు, ఫైనాన్షియల్ సంస్థలలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు తమ H-1B, H-4 వీసా ఉద్యోగులకు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని ఈమెయిళ్ల ద్వారా సూచించాయి.
సెప్టెంబర్ 21న కొత్త ఫీజు అమలులోకి వస్తుండగా, అంతర్జాతీయంగా ప్రయాణిస్తున్న H-1B, H-4 వీసాదారులు తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా పోతుందని కంపెనీలు ఆందోళన చెందాయి. జేపీ మోర్గాన్ తన ఉద్యోగులకు, సెప్టెంబర్ 21 ఉదయం 12:01 ET గంటల కంటే ముందే రావాలని, ఆ తర్వాత మరిన్ని మార్గదర్శకాలు వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేయాలని సలహా ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులు "అమెరికాలోనే ఉండాలని" సిఫార్సు చేసింది. ఈ చర్యలు, ఈ నిబంధన ఎంత ప్రభావాన్ని చూపుతుందో స్పష్టం చేస్తున్నాయి.
ఈ కొత్త వీసా ఫీజు ప్రకటనతో పాటు, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' అనే కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం H-1B వీసా దుర్వినియోగాన్ని అరికట్టడం, కంపెనీలపై కఠినమైన తనిఖీలు నిర్వహించడం, అమెరికన్ కార్మికులకు సరైన వేతనాలు అందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. చరిత్రలో మొదటిసారిగా, లేబర్ సెక్రటరీ స్వయంగా H-1B





















