Bajrang Dal Ban: కాంగ్రెస్‌కి బీజేపీ మరో కౌంటర్, ప్రతి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవాలని పిలుపు
Bajrang Dal Ban: భజరంగ్ దళ్ బ్యాన్ హామీకి కౌంటర్‌గా బీజేపీ అన్ని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠించనుంది.
Bajrang Dal Ban:
అన్ని ఆలయాల్లో చాలీసా పఠనం..
భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై బీజేపీ ఇప్పటికే కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది కాషాయ పార్టీ. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవనున్నట్టు ప్రకటించింది. రేపు (మే 4వ తేదీ) సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ బీజేపీ కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదవనున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ చాలీసా చదివేందుకు ప్లాన్ చేసుకుంటోంది ఆ పార్టీ. భజ్‌రంగ్ దళ్ బ్యాన్ హామీ పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా వాడుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హనుమాన్ చాలీసా అంశం తెరపైకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌కి యాంటీ హిందూ అనే ముద్ర పడేలా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు. కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ అటాక్‌తో ముందుకొస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి సభలోనూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. భజ్‌రంగ్ దళ్ బ్యాన్ హామీపై నేరుగా స్పందించకపోయినా...తన ప్రసంగాన్ని భజ్‌రంగ్ బలి కీ జై అంటూ స్టార్ట్ చేశారు. అలా కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
जय बजरंग बली pic.twitter.com/8CgSy4WvYW
— BJP (@BJP4India) May 3, 2023
ఇదీ వివాదం..
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఓ హామీ ఇప్పుడక్కడ పెద్ద దుమారమే రేపింది. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు మండి పడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తగలబెడుతూ ఆందోళనలు చేపడుతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు కర్ణాటకలోని మంగళూరులోనూ ప్రొటెస్ట్ చేశారు. తక్షణమే ఆ హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భజరంగ్ దళ్, PFI లాంటి సంస్థల్ని బ్యాన్ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ సంస్థలు సమాజంలో విద్వేషాలు రెచ్చ గొడుతున్నాయని ఆరోపించింది. అందుకే వాటిపై నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. RSSకి అనుబంధ సంస్థ అయిన భజరంగ్ దళ్...కాంగ్రెస్ వైఖరిపై మండి పడుతోంది. తమ సంస్థ దేశానికే గర్వకారణమని అంటోంది.
"దేశభక్తిని అందరిలోనూ రగిలించే గొప్ప సంస్థ భజరంగ్ దళ్. ఈ సంస్థ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. పవిత్రమైన గోవులను సంరక్షిస్తోంది. దేశంలోని లక్షలాది మందికి రక్తదానం చేస్తోంది. మా సంస్థ దేశానికే గర్వకారణం. కానీ కాంగ్రెస్ మాత్రం మా సంస్థను PFIతో పోల్చుతోంది. ఇలా పోల్చడం ఆత్మహత్యలాంటిదే. కాంగ్రెస్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతోంది. భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ యాంటీ హిందూ అని మరోసారి రుజువు చేసుకుంది. అధిష్ఠానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. వెంటనే ఈ హామీని వెనక్కి తీసుకోవాలి"
- వీహెచ్‌పీ ప్రతినిధి