News
News
X

Bihar IAS Officer: వాళ్లను కించపరచటం నా ఉద్దేశం కాదు, క్షమించండి - బిహార్ ఐఏఎస్ ఆఫీసర్

Bihar IAS Officer: తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగటంతో బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ సారీ చెప్పారు.

FOLLOW US: 
 
Bihar IAS Officer: 

సెంటిమెంట్లు హర్ట్ చేయాలని కాదు..

తీవ్ర స్థాయిలో తనపై విమర్శలు వెల్లువెత్తటంపై బిహార్ IASఆఫీసర్ హర్జోత్ కౌర్ బుమ్రా స్పందించారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఎవరినో కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. "నా మాటల వల్ల ఏ అమ్మాయైనా బాధ పడితే సారీ. ఎవరి సెంటిమెంట్లనూ హర్ట్ చేయటం నా ఉద్దేశం కాదు" అని వెల్లడించారు. రాతపూర్వకంగా ఈ క్షమాపణలు చెప్పారు హర్జోత్ కౌర్. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన హర్జోత్‌ కౌర్‌ను కొందరు విద్యార్థినులు ప్రశ్నలు అడిగారు. యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఓ బాలిక హర్జోత్‌ కౌర్‌ను ఓ ప్రశ్న అడిగింది. "ప్రభుత్వం స్కూల్ డ్రెస్‌లు ఇస్తోంది. స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తోంది. వీటితో పాటు విద్యార్థులకు ఇంకెన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. అలాంటప్పుడు రూ.20,30 విలువైన శానిటరీ ప్యాడ్స్‌ను ఇవ్వలేదా..?" అని ఓ బాలిక ప్రశ్నించింది. 
ఈ ప్రశ్న అడగగానే...అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కానీ...హర్జోత్ కౌర్ మాత్రం సీరియస్ అయిపోయారు. హద్దు పద్దు లేని డిమాండ్‌లు అడుగుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మహిళా కమిషన్ సీరియస్..

News Reels

"మీరడిగినట్టుగానే ప్రభుత్వం మీకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది. రేపు మీరు జీన్స్, ప్యాంట్స్, షూస్ కావాలని అడుగుతారు. ఇక ఫ్యామిలీ ప్లానింగ్ విషయానికొస్తే...ప్రభుత్వం నుంచి కండోమ్‌లు కూడా కోరుకుంటారు. అన్నీ ప్రభుత్వం నుంచే ఉచితంగా పొందటానికి నేనెందుకు అలవాటు పడాలి..? ఆ అవసరమేంటి..? " అని కామెంట్ చేశారు. ఈ సమాధానం విని ఆ బాలికకు కాస్త కోపమొచ్చినట్టుంది. వెంటనే కౌంటర్ ఇచ్చింది. 
"ఎన్నికల సమయంలో మీరే కదా ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చి అడిగేది" అని ఘాటుగా బదులిచ్చింది. దీనిపై...ఇంకా ఫైర్ అయ్యారు హర్జోత్ కౌర్. "ఇంత కన్నా స్టుపిడిటీ ఉంటుందా..? నువ్వు ఓటు వేయకు. పాకిస్థాన్ వెళ్లిపో. ప్రభుత్వం తరపున సౌకర్యాలు, డబ్బు తీసుకునేందుకే ఓటు వేస్తున్నావు" అని మండిపడ్డారు. దీనికి వెంటనే ఆ బాలిక కూడా బదులిచ్చింది. "నేను ఇండియన్‌ని. పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోతాను..?" అని ప్రశ్నించింది. "పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తోంది. వాళ్లంతా సరిగ్గా పన్నులు కడుతున్నప్పుడు వాళ్లకు కావాల్సిన సేవల్ని డిమాండ్ చేయడంలో తప్పేంటి..? " అని అడిగింది ఆ బాలిక. ఈలోగా మరో బాలిక కూడా తమకున్న సమస్య లేంటో వివరించింది. టాయిలెట్స్ సరిగా ఉండటం లేదని, కొందరు అబ్బాయిలూ తమ టాయిలెట్స్‌లోకి వస్తుంటే ఇబ్బందిగా ఉందని చెప్పింది. ఈ సమస్యలపైనా సరిగా స్పందించలేదు..హర్జోత్ కౌర్. సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేసింది. "ఇక్కడున్న అమ్మాయి లందరి ఇళ్లలో వాళ్లకు సెపరేట్ టాయిలెట్స్‌ ఉన్నాయా..?" అని ఆమె అడగటాన్ని చూసి అందరూ కంగు తిన్నారు. మొత్తానికి...అనవసర వ్యాఖ్యలు చేసి..వివాదంలో ఇరుక్కున్నారు హర్జోత్ కౌర్ బుమ్రా. దీనిపై...జాతీయ మహిళా కమిషన్ రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోగా హర్జోత్ కౌర్ స్పందించి...సారీ చెప్పారు. 

Also Read: National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో TS నేతలకూ నోటీసులు, వారికి అధిష్ఠానం స్పెషల్ క్లాసులు!

Published at : 30 Sep 2022 03:04 PM (IST) Tags: BIHAR bihar news Bihar IAS Officer Bihar IAS officer Harjot Kaur Bihar IAS officer Harjot Kaur Regrets

సంబంధిత కథనాలు

Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్‌ మామూలుగా లేదు

Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్‌ మామూలుగా లేదు

Petrol-Diesel Price, 08 December 2022: అనంతపురం, ఆదిలాబాద్‌లో భారీగా పెరిగిన చమురు ధర, మిగిలిన ప్రాంతాల్లోనూ మోతెక్కిపోతోంది

Petrol-Diesel Price, 08 December 2022: అనంతపురం, ఆదిలాబాద్‌లో భారీగా పెరిగిన చమురు ధర, మిగిలిన ప్రాంతాల్లోనూ మోతెక్కిపోతోంది

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

SSC CHSL Results 2020: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 తుది ఫలితాలు విడుదల, 4685 మందికి ఉద్యోగాలు!

SSC CHSL Results 2020: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 తుది ఫలితాలు విడుదల, 4685 మందికి ఉద్యోగాలు!

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

టాప్ స్టోరీస్

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ - ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ -  ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Bandi Sanjay: లిక్కర్ స్కామ్ కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది, డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేస్తే ఖేల్ కతం: బండి సంజయ్

Bandi Sanjay: లిక్కర్ స్కామ్ కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది, డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేస్తే ఖేల్ కతం: బండి సంజయ్