By: ABP Desam | Updated at : 20 Feb 2023 01:06 PM (IST)
సీతాకోక చిలుకల్ని చంపితే నేరం
Bihar Butterflies : సీతాకోక చిలుకలు అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా. అందుకే చాలా చోట్ల ప్రత్యేకంగా బటర్ ఫ్లై పార్క్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి అందమైన జీవులతోనూ వ్యాపారం చేసే దుర్మార్గం బయలుదేరింది. వాటిని పట్టుకుని విదేశాలకు ఎగుమతి చేయడం లేదా వాటిని చంపి వివిధ రకాల మెడిసిన్స్ తయారు చేస్తామని లేకపోతే.. ఇతర పదార్థాల తయారీకి వినియోగించడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. బీహార్‌లో ఇలాంటివి మరీ ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీతాకోక చిలుకల్ని చంపే వారిని నేరస్తుగా గుర్తింస్తూ ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది.
సీతాకోక చిలుకలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి పర్యావరణాన్ని మెరుగుపరుస్తాయి. జీవవైవిధ్యం ..జీవచక్రాన్ని సమతుల్యం చేయడానికి పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఈ జీవులను కాపాడుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అడవుల్లో తిరిగే లేదా నివసించే వ్యక్తులు సీతాకోకచిలుకలను వేటాడుతున్నారు. వాటిని మొత్తంగా వలలతో పట్టుకుని అమ్ముకుంటున్నారు. దీంతో ఇవి అంతరించే ప్రమాదం ఏర్పడిందని బీహార్ ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయంలో పెద్ద అడుగు వేసింది. సీతాకోక చిలుకలను వేటాడే వారని నియంత్రించాలని నిర్ణయించింది.
సీతాకోక చిలుకల సంరక్షణకు సంబంధించి బీహార్ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. , బీహార్ రాష్ట్ర జీవవైవిధ్య చట్టం ప్రకారం రాష్ట్రంలో సీతాకోకచిలుకలను చంపి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, అతనికి జైలు శిక్ష విధించవచ్చు. బీహార్ రాష్ట్ర జీవవైవిధ్య చట్టం కింద పరిధిని విస్తరించేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఇతర జంతువులను కూడా చేర్చింది. అడవి వ్యవస్థ, పెంపుడు జంతువులకు కూడా ఈ చట్టం కింద రక్షణ కల్పిస్తారు. ఎవరైనా హాని చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఔషధ మొక్కలు మరియు చిన్న జంతువులను కూడా ఈ చట్టం కింద చేర్చారు. దీంతో ఇప్పుడు వేట నిషేధిత ప్రాణుల్లో సీతాకోక చిలుక కూడా చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 7 మంది సభ్యుల కమిటీ. ఇందులో 50 వేల మందికి పైగా సభ్యులున్నారు. బీహార్ పంచాయతీరాజ్ శాఖ జిల్లా, పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8500 బీఎంసీలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 2023 నుండి, పాట్నాతో సహా అన్ని జిల్లాల్లో జీవవైవిధ్య పరిరక్షణ కోసం పనులు ప్రారంభించబడతాయి. రాష్ట్రంలోని జంతుజాలం, జాతులను పరిరక్షించడానికిఈ కమిటీలు పని చేస్తాయి. సీతాకోక చిలుక కనిపిస్తే పట్టుకుందామా అనిచూసే వారికి ఇప్పుడు బీహార్ ప్రభుత్వం చేసిన చట్టం.. వల్ల ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్, రష్మిక
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా