Margaret Alva Comments on BJP: 'మా ఫోన్లు బిగ్ బ్రదర్ ట్యాప్ చేస్తున్నారు'- ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు
Margaret Alva Comments on BJP: బిగ్ బ్రదర్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా సంచలన ఆరోపణలు చేశారు.
Margaret Alva Comments on BJP: ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల ఫోన్లను బిగ్ బ్రదర్ ట్యాపింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్‌ను ట్యాగ్ చేస్తూ మార్గరెట్ ట్వీట్ చేశారు.
The fear that ‘Big Brother’ is always watching & listening permeates all conversations between politicians across party lines in ‘new’ India. MPs & leaders of parties carry multiple phones, frequently change numbers & talk in hushed whispers when they meet. Fear kills democracy.
— Margaret Alva (@alva_margaret) July 26, 2022
BSNL రియాక్షన్
ఈ వ్యవహారంపై బీఎస్ఎన్ఎల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అల్వా ఫిర్యాదుపై తగిన చర్యలు చేపట్టామని, ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్‌ను బీఎస్ఎన్ఎల్ దాఖలు చేసిందని టెలికాం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
అల్వా ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఆమె ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేస్తారని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలపై తాము విశ్వాసంతో ఉన్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు.
Also Read: Lakhimpur Violence Case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ- లఖింపుర్ ఖేరీ కేసు అప్‌డేట్