MPs Suspended From Rajya Sabha: పెద్దల సభ నుంచి 19 మందిపై సస్పెన్షన్ వేటు- లిస్ట్‌లో TRS ఎంపీలు కూడా!
MPs Suspended From Rajya Sabha: సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంటూ 19 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు.
MPs Suspended From Rajya Sabha: రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. నిరసనలతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వీరిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సస్పెండ్ చేశారు. ఈ వారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.
19 opposition Rajya Sabha MPs suspended for the remaining part of the week for storming well of the House and raising slogans https://t.co/cyLSmWIvd3 pic.twitter.com/wGvlQQLNF5
— ANI (@ANI) July 26, 2022
లిస్ట్ ఇదే
- సుస్మితా దేవ్ (TMC)
- మౌసమ్ నూర్ (TMC)
- శాంత చెత్రి (TMC)
- డోలా సేన్ (TMC)
- శాంతాను సేన్ (TMC)
- అభి రంజన్ బిస్వార్ (TMC)
- ఎండీ నదిముల్ హక్ (TMC)
- ఎం హమద్ అబ్దుల్లా (డీఎంకే)
- బీ లింగయ్య యాదవ్ (TRS)
- ఎ.ఎ.రహీం సీపీఐ(ఎం)
- రవీంద్ర వద్దిరాజు (TRS)
- ఎస్.కళ్యాణసుందరం (డీఎంకే)
- ఆర్.గిరంజన్ (డీఎంకే)
- ఎన్.ఆర్. ఎలాంగో (డీఎంకే)
- వి.శివదాసన్ సీపీఐ(ఎం)
- ఎం. షణ్ముగం (డీఎంకే)
- దామోదర్ రావు (TRS)
- సంతోష్ కుమార్ పి (సీపీఐ)
- ఎన్వీఎన్ సోము (DMK)
అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందున సభను తొలుత 20 నిమిషాలు, తర్వాత మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు. లిస్ట్‌లో ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు.
It is clear that the Modi govt does not have an answer to inflation. If Finance Minister is not well, PM Modi can answer our questions. This is unfair to suspend 19 MPs for raising questions in parliament. We will protest inside and outside the parliament: TMC MP Sushmita Dev pic.twitter.com/lrtNHmmLxA
— ANI (@ANI) July 26, 2022
తిరిగి సమావేశం అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడక పోవడంతో బుధవారానికి రాజ్యసభను వాయిదా వేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో అత్యధికులు టీఎంసీ, డీఎంకే సభ్యులే.
Also Read: Rahul Gandhi Tweet: 'మోదీని ఓడించాలంటే అదే మార్గం'- అరెస్ట్ తర్వాత రాహుల్ ట్వీట్
Also Read: Fact Check: భయ్యా! తెలియని వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం నేరమా? లైసెన్స్ తీసేసుకుంటారా?