By: Ram Manohar | Updated at : 30 Nov 2022 04:20 PM (IST)
ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డు గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకునేందుకు డబ్బు దొంగిలించి పరారీ అయ్యాడు.
Bengaluru Crime News:
రూ.20 లక్షలతో పరారీ..
ఇంటికి కాపలా ఉన్న వాళ్లే..ఆ ఇంటికి కన్నం పెడితే..? బెంగళూరులో అలాంటి ఘటనే జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM సెక్యూరిటీ గార్డ్ అదే ATM నుంచి డబ్బు దొగిలించి పరారయ్యాడు. అక్షరాలా రూ.20 లక్షలు కాజేశాడు. అప్పులు తీర్చడానికో, గొప్పగా బతకడానికో కాదు. గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోటానికి. అంటే..పెళ్లి ఖర్చుల కోసం 20 లక్షలు పట్టుకెళ్లాడన్నమాట. పోలీసులు వెంటనే అప్రమత్తమై అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14.2 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. అసోంకు చెందిన 23 ఏళ్ల దిప్నోకర్‌కు ఆర్నెల్ల క్రితమే విల్సన్ గార్డెన్ ప్రాంతంలోని ATM వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం వచ్చింది. క్యాష్ లోడింగ్ స్టాఫ్‌తో సన్నిహితంగా ఉంటూ...క్యాష్ క్యాసెట్‌ను ఓపెన్ చేసే పాస్‌వర్డ్‌ను తెలుసుకున్నాడు. ఆ తరవాతే డబ్బు కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. కరీంగంజ్‌కు వెళ్లిపోయి తన గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవాలనుకున్నాడు. ఈ నెల 17న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో దొంగతనం చేసేందుకు ప్లాన్ చేశాడు. డబ్బు కాజేసే సమయంలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ తీసేసి వేరే బట్టలు మార్చుకున్నాడు. అది కూడా ATMలోనే. ఇదంతా CCTVలో రికార్డ్ అయింది. ఓ కెమెరా నుంచి దూరంగా జరిగి కనిపించకుండా లైట్ ఆఫ్ చేశాడు.
తెల్లవారి సెక్యూరిటీ గార్డుతో పాటు డబ్బు కూడా కనిపించకపోవటం వల్ల అనుమానం వచ్చి సీనియర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.19 లక్షల 96 వేల 600 రూపాయలతో పరారీ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అనుమానితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు... దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డబ్బు కాజేసిన వెంటనే ఫ్రెండ్స్‌తో కలిసి గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నాడు నిందితుడు. లగ్జరీ హోటల్స్‌లో గడిపాడు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, డబ్బుంటేనే గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి కుదురుతుందని అందుకే..దొంగతనం చేశానని చెప్పాడు నిందితుడు.
తాళి లాగేసిన ప్రియుడు..
ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రియుడు...పూజారి నుంచి మంగళసూత్రం లాగేసుకున్నాడు. బలవంతంగా తన ప్రేయసికి తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. తమిళనాడులోని తొందియర్‌పేట్‌లో నేతాజీ నగర్‌లో ఇటీవలే జరిగిందీ ఘటన. తన లవర్ పెళ్లి జరుగుతోందని తెలిసి ఫంక్షన్ హాల్‌కు వెళ్లిన యువకుడు ఆమెకు బలవంతంగా తాళి కట్టాలని చూశాడు. ఇంతలో వధువు కుటుంబ సభ్యులు వచ్చి వెనక్కి లాగేశారు. వివాహం జరుగుతుండగా...పూజారి మంగళసూత్రాన్ని వరుడికి అందించబోయారు. హఠాత్తుగా ఓ యువకుడు వచ్చి ఆ తాళిని లాగేసుకున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ షాక్‌లో ఉండగానే...అమ్మాయి మెడలో కట్టాలని చూశాడు. పెళ్లికూతురు తరపున వాళ్లు ఒక్కసారిగా వచ్చి ఆ యువకుడిపై పడ్డారు. వెనక్కి లాగేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...ఆ యువకుడికి ఆ వధువే మెసేజ్ పంపిందట. "వచ్చి నన్ను తీసుకెళ్లు" అని మెసేజ్ చేశాకే...ఆ యువకుడు అక్కడికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో వివాహం ఆగిపోయింది. వరుడు, వధువు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది.
Also Read: Bilkis Bano: సుప్రీం తీర్పుని సవాల్ చేసిన బిల్కిస్ బానో, రిట్ పిటిషన్ దాఖలు
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు
Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్ఎంల నిర్బంధం
Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి