By: ABP Desam | Updated at : 03 Aug 2022 05:31 PM (IST)
Edited By: Murali Krishna
బంగాల్ కేబినెట్‌లో 9 కొత్త ముఖాలు- పెద్ద మార్పే చేసిన దీదీ! ( Image Source : ANI )
Bengal Cabinet Reshuffle: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని రీషఫుల్ చేశారు. ఈ సారి కేబినెట్‌లో తొమ్మిది మంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు.
ఇందులో బాబుల్ సుప్రియో, స్నేహసిస్ చక్రవర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందార్, తజ్ముల్ హుస్సేన్, సత్యజిత్ బర్మాన్ వంటి వారు ఉన్నారు.
West Bengal cabinet reshuffle | Nine ministers take oath in Kolkata - Babul Supriyo, Snehasis Chakraborty, Partha Bhowmick, Udayan Guha, Pradip Mazumder, Tajmul Hossain, Satyajit Barman. Birbaha Hansda & Biplab Roy Chowdhury are sworn in as Ministers with independent charges. pic.twitter.com/H4e4So7D8B
— ANI (@ANI) August 3, 2022
ప్రమాణస్వీకారం
కోల్‌కతాలో వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు గిరిజన నేత బీర్బహా హన్స్దా, బిప్లబ్ రాయ్ చౌదరి ప్రమాణం చేశారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దీదీ ఇటీవల కీలక ప్రకటన చేశారు. కొత్తగా నలుగురు లేదా ఐదుగుర్ని కేబినెట్‌లో చేర్చుకుంటామని దీదీ చెప్పారు. అయితే ఏకంగా 9 మందికి అవకాశం కల్పించారు.
" చాలా మంది ఏదేదో రాస్తున్నారు. అయితే మొత్తం కేబినెట్‌లో మార్పు చేసే ఆలోచన మాకు లేదు. అయితే కేబినెట్‌లో మార్పులు ఉంటాయి. మంత్రులు సుబ్రతా ముఖర్జీ, సదన్ పాండేలను మేం కోల్పోయాం. పార్థ చటర్జీ జైలులో ఉన్నారు. ఆయనకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకోలేను. అందుకే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపడతాం. "
ఈ పరిణామాల అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించారు దీదీ. అంతేకాకుండా పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు.
Also Read: Madhya Pradesh News: దారుణ ఘటన- బెయిల్‌పై విడుదలై అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్ రేప్!
AP EAMCET Counselling Dates 2022: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి
Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!