BBC Advice To Employees: ఐటీ అధికారులకు సహకరించండి, ఉద్యోగులకు BBC యాజమాన్యం మెయిల్స్
BBC Advice To Employees: ఉద్యోగులందరూ ఐటీ అధికారులకు సహకరించాలని BBC యాజమాన్యం మెయిల్ చేసింది.
BBC Advice To Employees:
సమాధానాలివ్వండి: BBC
ఢిల్లీ, ముంబయిల్లోని BBC కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కంపెనీ స్పందించింది. ఉద్యోగులందరికీ మెయిల్ చేసింది. ఐటీ అధికారులకు అందరూ సహకరించాలని అందులో తెలిపింది. "ప్రస్తుతం జరుగుతున్న ఐటీ సర్వేలకు ఉద్యోగులందరూ సహకరించండి. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి" అని మెయిల్ చేసింది.
"ఒక వేళ మీ వ్యక్తిగత ఆదాయం గురించి అడిగితే సమాధానం చెప్పకండి. శాలరీకి సంబంధించిన ప్రశ్నలు అడిగితే మాత్రం సరైన బదులివ్వండి"
-BBC యాజమాన్యం
An update on the situation in India. pic.twitter.com/FYVFwdQWxE
— BBC News Press Team (@BBCNewsPR) February 14, 2023
The Income Tax Authorities are currently at the BBC offices in New Delhi and Mumbai and we are fully cooperating.
— BBC News Press Team (@BBCNewsPR) February 14, 2023
We hope to have this situation resolved as soon as possible.
కేవలం బ్రాడ్‌కాస్ట్ విభాగంలో పని చేసే వాళ్లు మాత్రమే ఆఫీస్‌కు రావాలని, మిగతా వాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ సర్వే అధికారికంగా ప్రకటన చేసింది BBC.అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అన్ని సమాధానాలూ ఇస్తున్నట్టు చెప్పింది. విచారణకు సహకరిస్తున్నట్టు వెల్లడించింది. కొంత మంది ఉద్యోగులు వెళ్లిపోయారని, కానీ కొంత మందిని మాత్రం అధికారులు విచారిస్తున్నారని తెలిపింది. వీలైనంత త్వరగా ఈ విచారణ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పూర్తైన వెంటనే ఎప్పటి లాగే భారతీయులకు తమ సేవలు అందించేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది.
సోదాలు..
బీబీసీ నెట్‌వర్క్‌కు చెందిన ఢిల్లీ , ముంబై ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి హిందీ, తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల డిజిటల్ విభాగాలు ఢిల్లీ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ముంబైలోనూ కొన్ని ప్రాంతీయ భాషల విభాగాల ఆఫీసులు ఉన్నాయి. దాదాపుగా 60, 70 మంది ఐటీ అధికారులు ఒక్క సారిగా ఢిల్లీ ఆఫీసులోకి వచ్చి ఉద్యోగులందరి దగ్గర ముందుగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సోదాలు ప్రారంభించారు. ఆఫీసు ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకపోవడంతో.. సోదాల విషయంపై రహస్యంగా ఉంది. ఐటీ అధికారులు ఇటీవలి కాలంలో బీబీసీ ఆదాయ, వ్యయాల గురించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి భారత బీబీసీ విభాగాలకు వస్తున్న విరాళాలు... నిధులతో పాటు వాటికి సంబంధించిన సోర్స్ ను ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల బీబీసీ విషయంలో కేంద్రం ఆగ్రహంతో ఉంది. గుజరాత్ లో గోద్రా అల్లర్లకు సంబంధించిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ ఆన్ లైన్‌లో విడుదల చేసినప్పటి నుండి కేంద్రం ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ఐటీ దాడులతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
Also Read: BBC Documentary Row: అసలేంటి బీబీసీ డాక్యుమెంటరీ ? ఆ కారణంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయా ?