Baba Balaknath : ప్రసాదం పేరుతో మత్తుమందిచ్చి రేప్ చేశాడు - బాబా బాలక్ నాథ్‌పై మహిళ ఆరోపణ - సీఎం ఆశలు పోయినట్లే !
Rajasthan : రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సీఎంగా రేసులో వినిపించిన పేర్లలో ఒకటి బాబా బాలక్ నాథ్. ఇప్పుడు ఆయన అశ్లీల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Baba Balaknath obscene VIDEO goes viral : రాజకీయాల్లో స్వామిజీలు ఇటీవలి కాలంలో చురుకుగా ఉంటున్నారు. యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ఎంపికైన తర్‌వతా ఆయన స్ఫూర్తితో చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి వారిలో రాజస్థాన్‌కు చెందిన బాబా బాలక్ నాథ్ ఒకరు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత వసుంధర రాజేను సీఎంగా చేయకూడదని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎం ఎవరు అయితే బాగుంటుందని ప్రచారంలోకి వచ్చిన పేర్లలో బాబా బాలక్ నాథ్ ఒకరు.
ఈ బాబా బాలక్ నాథ్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యారు. తనకు ప్రసాదం పేరుతో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఓ మహిళ ఆయనపై కేసు పెట్టింది. బాబా బాలక్ నాథ్ ఆ మహిళతో అసభ్యంగాప్రవర్తిస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేసి బాబా బాలక్ నాథ్ పై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
राजस्थान : सीकर जिले में कार में रोमांस कर रहे बाबा बालकनाथ पर पुलिस ने रेप की FIR दर्ज की।
— Satyapal Arora 💯% FB (@JanAwaaz3) October 20, 2024
पीड़िता का आरोप है कि बाबा ने तंत्र-मंत्र के सहारे परेशानियां दूर करने का भरोसा दिया और इज्जत लूटता रहा।
ये भाजपा को सनातन के नाम पर वोट भी दिला रहा था pic.twitter.com/oaWl7OSWhj
రాజస్తాన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తి బాబా బాలక్ నాథ్. రాజస్థాన్ యోగి అని పిలుస్తారు. బీజేపీ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ మస్త్ నాథ్ మఠంలో ఎనిమిదో మహంత్. ఈయన ఓబీసీ కేటగిరి నుంచి వచ్చారు, యూపీలో వలెనే బాబా బాలక్ నాథ్ కు బీజేపీ సీఎం పదవి అప్పగించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈయన తిజారా అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 6173 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
In #Rajasthan's #Sikar, Baba Balaknath raped woman disciple after feeding her sweets.
— Hate Detector 🔍 (@HateDetectors) October 20, 2024
A video of Baba touching the woman inappropriately has gone viral.
The Baba had told the woman that he will drop her at her home through his four-wheeler and then raped her. pic.twitter.com/hMJjGvNCDh
ఈ రాజకీయ స్వామిజీ అనుచరులు ఆ మహిళ చేస్తున్న ఆరోపణలన్నీ ఫేక్ అని అంటున్నారు. రాజకీయ కుట్ర చేశారని నిందిస్తున్నారు. అందులో ఏది నిజం ఉందో కానీ బాబా బాలక్ నాథ్ ఇమేజ్ మాత్రం తగ్ిగపోతోంది.