(Source: ECI/ABP News/ABP Majha)
Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్
మండే అగ్ని గోళంలా కనిపించే సూర్యుడిలో ఏం ఉంటాయో తెలుసా... సూర్యుడి స్పష్టమైన ఇమేజ్ మీరు ఎప్పుడైనా చూశారా...? అయితే ఈ కథనం మీ కోసమే.
సూర్యుడి అత్యంత స్పష్టమైన ఫొటో తీసినట్లు ఓ ఖగోళ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. తాను తీసిన సూర్యుడి అత్యంత స్పష్టమైన ఫొటోలను పోస్టు చేశారు. ఆండ్రూ మెక్‌కార్థీ అనే ఖగోళ ఫొటో గ్రాఫర్ సౌర వ్యవస్థలో అతిపెద్ద నక్షత్రమైన సూర్యుడికి సంబంధించి సుమారు 1,50,000 ఫొటోలు తీశారు. వీటన్నింటినీ లేయర్స్ గా రూపొందించారు. ఆ అద్భుత చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో @కాస్మిక్-బ్యాక్‌గ్రౌండ్ అనే పేరుతో ఆండ్రూ ఖాతా నిర్వహిస్తున్నారు. సూర్యుడి నుంచి ఉద్భవించే చిన్న క్రేటర్స్, మండుతున్న అలలు, అలాగే స్పేస్ ఫ్లేర్ లను అత్యంత స్పష్టంగా ఆండ్రూ చిత్రీకరించారు. తాను తీసిన చిత్రాలన్నింటినీ లేయర్స్ గా మార్చి 300 మెగాపిక్సెల్ ఇమేజ్‌గా చేశారు ఆండ్రూ. ఇది సాధారణ 10 మెగాపిక్సెల్ కెమెరా ఇమేజ్ కన్నా 30 రెట్లు పెద్దది. సౌర వ్యవస్థ అతి పెద్ద నక్షత్రం క్లిష్టమైన అద్భుతమైన వివరాలను తెలియజేయడానికి ఆండ్రూ మెక్‌కార్తీ సూర్యుని 150,000 వ్యక్తిగత చిత్రాలను లేయర్డ్ చేశాడు.
Also Read: చంద్రుడిపై మిస్టరీ హౌస్?.. ఎవరు కట్టారబ్బా?? చైనా రోవర్‌కు చిక్కిన అరుదైన ఆకారం
View this post on Instagram
ఆండ్రూ తీసిన ఫొటోల్లో సూర్యునిపై డార్క్ సన్ స్పాట్స్, ఈక ఆకారంలో ఆకృతి, స్విర్ల్స్ కంటికి కనిపించేంతగా స్పష్టంగా ఉన్నాయి. ఈ ఇమేజ్ లో చీకటి స్పాట్స్ ఫొటోగ్రాఫిక్ ప్రక్రియలో రివర్స్ చేశారు. వాస్తవానికి ఇవి సూర్యుడిలో చాలా ప్రకాశవంతమైన శక్తి ప్రాంతాలు. ఈ ఫొటోలు తీయడం చాలా ప్రమాదంతో కూడిన ప్రక్రియ. ఒక్కొసారి ఫొటో గ్రాఫర్ తన చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాల్ని నివారించేందుకు టెలిస్కోప్ లో రెండు ఫిల్టర్‌లు ఉపయోగిస్తారు. ఇవి అగ్ని ప్రమాదాన్ని నివారిస్తాయి.
ఆండ్రూ తన ఇన్ స్టా ఖాతాలో ఇలా రాశాడు... 'నేను ఇమేజ్‌ని ప్రాసెస్ చేయడం పూర్తి చేసే వరకు అది నిజంగా ఎలా ఉంటుందో నేను చూడలేను. ఇది చాలా ప్రత్యేకమైనది. సూర్యుడిని ఫొటో తీయడానికి నేను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను. ఇది ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. సూర్యుడిని ఫొటోలు తీయడానికి నేను ఎప్పుడూ విసుగుచెందను. సూర్యుడిని అత్యంత స్పష్టంగా చూసేందుకు నేను కొన్ని మార్పులు చేసిన టెలిస్కోప్‌ని ఉపయోగించాను. ఆ ఫోటోలన్నింటిని కలిపితే సూర్యుడి గురించి నమ్మశక్యం విషయాలన్ని మనకు తెలుస్తాయి.
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
సూర్యుడు సౌర వ్యవస్థలో చాలా ముఖ్యమైన నక్షత్రం. దీని వ్యాసం 1.39 మిలియన్ కి.మీ, భూమి ద్రవ్యరాశి కంటే 3,30,000 రెట్లు ఎక్కువ. సూర్యుడిలో మూడు వంతులు హైడ్రోజన్ వాయువు ఉంటుంది. హైడ్రోజన్ తో పాటు హీలియం, ఆక్సిజన్, కార్బన్, నియాన్, ఐరన్ ఉంటాయి. ఇది G-టైప్ ప్రధాన శ్రేణి నక్షత్రం, కొన్నిసార్లు దీనిని పసుపు మరగుజ్జు(ఎల్లో డ్ర్వాఫ్) అని పిలుస్తారు.
Read Also: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి