Asteroid Approaches Earth: భూమి వైపు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్... బుర్జ్ ఖలీపా కన్నా పెద్దది... ప్రమాదంపై నాసా క్లారిటీ
గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంగా బుర్జ్ ఖలీపా పరిమాణంలో ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపు దూసుకోస్తుంది. అయితే ఈ శకలంతో భూమికి ప్రమాదం లేదని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
భూమి వైపు ఓ గ్రహశకలం దూసుకొస్తున్నది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయణిస్తూ ఇవాళ భూమికి సమీపంగా రానుంది. దుబాయ్ బుర్జ్ ఖలీఫా పరిమాణంలో ఉన్న ఆ గ్రహ శకలం వల్ల భూమికి ముప్పేమీ లేదని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
గ్రహశకలం 2016 AJ193
గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో ఓ గ్రహశకలం దూసుకోస్తుంది. దీనిపై ఖగోళశాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. శనివారం ఈ ఆస్ట్రాయిడ్ భూ గ్రహానికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. దీనిని ప్రమాదకరమైన అంతరిక్ష శకలంగా పేర్కొంది. కానీ ప్రస్తుతానికి ఈ గ్రహ శకలం వల్ల ఎటువంటి హాని లేదని పేర్కొంది. ఆ గ్రహశకలాన్ని 2016 AJ193 అని పిలుస్తున్నారు. దీని వెడల్పు 4,500 అడుగులు. ఇది తన కక్ష్యలో తిరుగుతూ శనివారం భూమికి చేరువగా వచ్చి వెళ్తుందని పరిశోధకులు తెలిపారు.
Also Read: Traffic Challan Telangana: పెండింగ్ చలానా ఉంటే పోలీసులు మన బండి సీజ్ చేయొచ్చా? హైకోర్టు క్లారిటీ
2016లో గుర్తింపు
గ్రహ శకలం భూమికి సమీపించే సమయంలో వాటి మధ్య దూరం భూమి, చంద్రుడి మధ్య దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని నాసా చెప్పింది. ఈ శకలం తిరిగి 2063లో భూమికి దగ్గరగా వస్తుందని తెలిపింది. 2016 జనవరిలో హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ సాయంతో ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత నాసా శాస్త్రవేత్తలు నియోవైస్ అనే వ్యోమనౌక సాయంతో దీనిపై పరిశోధన చేశారు. ఈ శకలం చాలా చీకటిగా ఉందని, కాంతి పరావర్తనం అంతగా లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఆస్ట్రాయిడ్ 5.9 సంవత్సరాలకొకసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు.
Also Read: India Corona Cases: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 151 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు
శనివారం రాత్రి 8.40 గంటలకు
గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఆ గ్రహశకలం శనివారం రాత్రి 8.40 గంటల సమయంలో భూమికి అత్యంత సమీపంలోకి వచ్చి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతానికి దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.
ఆస్ట్రాయిడ్స్ అంటే?
ఆస్ట్రాయిడ్స్ అంటే సూర్యుని కక్ష్యలో తిరిగే చిన్న, రాయి లాంటి శకలాలు. గ్రహాల మాదిరిగానే గ్రహ శకలాలు సూర్యుని చుట్టు పరిభ్రమిస్తుంటాయి. కానీ గ్రహల కన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని చిన్న గ్రహలు లేదా ప్లానిటాయిడ్స్ అని కూడా పిలుస్తారు. విశ్వంలో లక్షల సంఖ్యలో గ్రహశకలాలు ఉన్నాయి. కొన్ని అడుగుల నుంచి వందల కిలోమీటర్ల పరిమాణంలో ఇవి విస్తరించి ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉంటాయి.
Also Read: YS Viveka Case: వైఎస్ వివేకా హంతకులెవరు?... ఆచూకీ చెబితే 5 లక్షలు నజరానా