Madhya Pradesh: కానిస్టేబుల్‌గా పని చేసి నోట్ల కట్టల గుట్ట కూడబెట్టాడు - చాలనుకుని వీఆర్ఎస్ తీసుకున్నాడు - అక్కడే అసలు ట్విస్ట్
Ex Constable: ఓ సాదాసీదా కానిస్టేబుల్ గా చేసిన వ్యక్తి కోట్లు కూడబెట్టాడు. దొరికిపోతే మొత్తం పోతుందని వీఆర్ఎస్ తీసుకున్నాడు. కానీ టైం కలసి రాలేదు.
Assets Worth Rs 8 Crore Seized From Ex-Constable In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ మాజీ కానిస్టేబుల్ ఇంటిపై లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్న ఆయన చాలా కూడబెట్టారన్న ఫిర్యాదులు రావడంతో లోకాయుక్తు పోలీసులు దాడి చేశారు. అయితే అవన్నీ ఉత్తుత్తి ఫిర్యాదులు అనుకున్నారు. కానీ ఆయన ఇంట్లో దాడి చేసిన తర్వాత లోకాయుక్త పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. వారి ఇంట్లో ఉన్న సంపద చూసి ఆశ్చర్యపోయారు.
బంగారం అయితే ఎక్కువగా కనిపెడతారని.. ఇబ్బంది అవుతుందని ఆ కానిస్టేబుల్ తెలివిగా వ్యవహరించాడు. ఎక్కువగా వెండి కొన్నాడు. అంతా ఇంకా కాదు. ఇల్లంతా వెండే ఉంది. ఏకంగా 234 కేజీల వెండి ఉన్నట్లుగా గుర్తించారు. క్యాష్ కూడా చాలా ఉంది. రెండున్నర కోట్ల రూపాయల క్యాష్ గుర్తించారు. ఇంకా బంగారం కూడా ఉంది. మొత్తంగా రూ. పది కోట్ల వరకూ ఇంట్లో ఉన్న సంపదను గుర్తించారు. ఇంకా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వాటి సంగతి ఆరా తీస్తున్నారు.
Also Read: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
సౌరభ్ శర్మ అనే వ్యక్తి ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంట్ లో కానిస్టేబుల్ గా పని చేసేవాడు. 2015లో సర్వీసులో చేరాడు. గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నాడు. అంటే ఎనిమది ఏళ్ల పాటు మాత్రమే ఉద్యోగంలో ఉన్నాడు. మిగతా కానిస్టేబుళ్లు ఉంతా పదో పరకో లంచాలకు ఆశపడతారేమో కానీ సౌరభ్ శర్మ మాత్రం పెద్ద పెద్ద బిగ్ షాట్స్ నే టార్గెట్ చేసుకున్నాడు. రవాణా శాఖలో ఉండటం వల్ల అసలు ట్రాన్స్ పోర్టు స్కాములు ఎలా జరుగుతాయో తెలుసుకుని రోడ్ల మీద కాపు వేసేవాడు. ఇలా విపరీతంగా సంపాదించాడు.
దాదాపుగా ఎనిమిదేళ్లుగా ఇదే పని చేశాడు . ఎప్పుడో ఓ సారి దొరికిపోతానని ఆయనకు డౌట్ వచ్చిందేమో కానీ.. ఇప్పటి వరకూ ఇది చాలని అనుకున్నాడు. ఉన్న డబ్బు.. పెట్టబుడులతో ఇక ఉద్యోగం చేయకపోయినా విలాసంగా బతకవచ్చని అనుకున్నాడు . ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని అంతా వైట్ చేసుకుంటూ పోవచ్చని వీఆర్ఎస్ తీసేసుకున్నాడు. ఉన్నతాధికారులు కూడా ఆమోదించారు. అయితే లోకాయుక్త మాత్రం ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో సోదాలు చేయాలని ఆదేశిలించారు. చివరికి అలా దొరికిపోయారు.
Also Read: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
ఈ సొమ్ము అంతా స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వఉద్యోగి కాకపోవడతో ప్రత్యేకంగా తీసుకునే చర్యలేమీ ఉండవని అందుకే ఐటీ అధికారులు కేసులు నమోదు చేశారని అంటున్నారు. మొత్తంగా ఆ కానిస్టేబుల్ మంచి ప్లాన్డ్ గా అనతి కాలంలోనే ఎక్కువగా సంపాదించేసి.. ముందుగానే సేఫ్ గా బయటకు వచ్చినప్పటికీ కాలం మాత్రం కలసి రాలేదు. ఇప్పుడు ఉద్యోగం లేదు.. ఆ డబ్బు కూడా లేదు.