అన్వేషించండి

Assam Tea Auction: ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయాయి.. కేజీ టీ పొడి లక్ష రూపాయలా!

అసోంలో ఓ ప్రత్యేకమైన టీ పొడికి వేలంలో రికార్డ్ స్థాయిలో ధర పలికింది. కేజీ రూ.లక్షకు అమ్ముడుపోయింది.

చాయ్.. కూలీల నుంచి కోటీశ్వరుల వరకు దీనికి ఫిదా అవ్వాల్సిందే. ఎంత బిజీ పనిలో ఉన్నా ఓ కప్పు టీ కొట్టకపోతే భారతీయులకు ఏ పనీ సరిగా కాదు. అందులోను అసోంలో ఉత్పత్తయ్యే టీ పొడి మరింత ప్రత్యేకం. దాని డిమాండ్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఈ సారి అసోంలో తయారైన ప్రత్యేక టీ పొడి రికార్డ్ స్థాయిలో కేజీ రూ.99,999కి అమ్ముడుపోయింది.

అంత ఖరీదా? 

అసోంలో ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. ఈరోజు మనోహరి టీ ఎస్టేట్‌కు చెందిన కిలో టీ పొడి వెలంలో రూ.99,999కి అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది. దేశ చరిత్రలో కేజీ టీ పొడికి ఇదే అత్యధిక రేటు.

సౌరవ్​ టీ ట్రేడర్స్​ అనే సంస్థ ఈ టీ పొడిని కొనుగోలు చేసింది. ఈ తరహా టీలకు విదేశాల్లో కూడా డిమాండ్​ పెరుగుతుందని మనోహర్ టీ ఎస్టేట్ ఓనర్ రాజన్ లోహియా అన్నారు. ఈ తరహా టీ పొడిని డిమాండ్ బట్టి ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి సంస్థలు కూడా ఇలాంటి టీ పొడులను మరిన్ని విక్రయించి.. దేశాన్ని ప్రత్యేక టీ పొడులకు కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నామన్నారు.

అసోం టీ..

1660 కాలంలో మన దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే తేయాకును తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడు నీళ్లలో వేసి.. నిమ్మరసం కలిపి తాగేవారు. 18వ శతాబ్దంలో స్కాంట్లాండ్ ప్రజలు వ్యాపారులుగా భారత్‌ వచ్చారు. అసోంలో తేయాకులు పండించడాన్ని వారు గుర్తించారు.

ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు 1839లో అసోం టీ కంపెనీ ఒకటి స్థాపించి తేయాకును పండించడం మొదలుపెట్టారు. అలా 1862 నాటికి అసోం ప్రాంతంలో 160 తేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం 800కు పైగా తేయాకు తోటలు ఉన్నాయి. అందుకే అసోం టీ చాలా ప్రత్యేకం.

Also Read: Covishield for Children: మరో 6 నెలల్లో పిల్లలకు కరోనా టీకా: పూనావాలా

Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్

Also Read: WPI Inflation: సామాన్యులకు మరో దెబ్బ.. 12 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

Also Read: Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో పెరుగుతోన్న వ్యాప్తి

Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget