Board Paper Leak: పరీక్ష ముందు రోజే లీక్ అయిన ఎగ్జామ్ పేపర్, తప్పు మాదే అని ఒప్పుకున్న సీఎం
Board Paper Leak: అసోంలో పదో తరగతి ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం తమ ప్రభుత్వ వైఫల్యమే అని సీఎం హిమంత బిశ్వ శర్మ అంగీకరించారు.
Assam Paper Leak:
అసోంలో పదో తరగతి పేపర్ లీక్..
అసోంలో పదో తరగతి ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం సంచలనం సృష్టించింది. HSLC జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. రూ.3 వేలకు ఈ పేపర్‌ను విక్రయించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా ఈ పేపర్‌ను అందరికీ పంపినట్టు డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ...ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. ఈ లీక్ వెనక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని చెప్పిన ఆయన...మొత్తం ముగ్గురు ఉపాధ్యాయులు కుమ్మక్కై ఈ నేరానికి పాల్పడినట్టు వివరించారు.
"జనరల్ సైన్స్ ఎగ్జామ్ పేపర్‌ను ఒక్కో రేటుకి అమ్మేసినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. రూ.100-రూ.3000 వరకూ విక్రయించారు. కొందరికి రూ.100కే అమ్మేశారు. ఇంకొందరికి రూ.200-300 వరకూ విక్రయించారు. ఒకరికైతే రూ.3 వేలకు ఇచ్చేశారు. ఇదంతా వాట్సాప్‌లోనే జరిగింది. ఇదంతా అసలు ఎక్కడ నుంచి మొదలైంది అనేది పరిశీలిస్తున్నాం. విచారణలో పురోగతి సాధించాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం."
- జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, డీజీపీ
ఆదివారం రాత్రి ఈ పేపర్ లీక్ అయింది. సీఐడీ ఈ కేసు విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇందులో ప్రధాన నిందితుడిని పట్టుకునేంత వరకూ విచారణ వేగవంతంగా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. వెంటనే పరీక్షను రద్దు చేసిన ప్రభుత్వం మార్చి 30న నిర్వహిస్తామని వెల్లడించింది.
HCM @CMOfficeAssam has informed the house that Assam Police has cracked the SEBA question paper leak case and identified the persons involved. Unfortunately, three teachers and a centre in charge had done the leakage. Police will come out with details soon.
— Ranoj Pegu (@ranojpeguassam) March 16, 2023
Reference paper leakage case of General Science (C3) of HSLC examination being conducted by Board of Secondary Education, Assam - 22 persons have been detained at/from Guwahati, North Lakhimpur, Dhemaji, Sadiya, Dibrugarh and Tinsukia. Further lawful action as mandated by law is… https://t.co/L2jlUnZw6f
— GP Singh (@gpsinghips) March 14, 2023
తెలంగాణలోనూ ఇదే విధంగా ప్రశ్నపత్రాల లీక్ చేశారు. ఈ కారణంగా అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు మార్చి 5న నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్ష కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమైంది. దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షపై బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మార్చి 14న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజా నిర్ణయం వెలువడింది.
Also Read: H3N2 Virus India: పెరుగుతున్న ఫ్లూ కేసులు, 10 రోజుల పాటు స్కూల్స్ బంద్