Asaduddin Owaisi Attack: ఓవైసీకి Z కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్ర ప్రభుత్వం
ఓవైసీకీ కేంద్రం Z కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కల్పించింది. ఓవైసీపై నిన్న దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
![Asaduddin Owaisi Attack: ఓవైసీకి Z కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్ర ప్రభుత్వం Asaduddin Owaisi Attack AIMIM Chief Asaduddin Owaisi Provided With Z Category Security After Firing Incident Asaduddin Owaisi Attack: ఓవైసీకి Z కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్ర ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/18/6280752e096da2318cdb9e693491dfff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారత ప్రభుత్వం భద్రతను పెంచింది. ఓవైసీకి Z కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కల్పించింది. ఓవైసీ కారుపై నిన్న దుండగులు కాల్పులు జరిపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భద్రతపై సమీక్ష నిర్వహించి Z కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది.
After attack on his convoy, Asaduddin Owaisi gets Z category security
— ANI Digital (@ani_digital) February 4, 2022
Read @ANI Story | https://t.co/4EwFGSE8cw#AsaduddinOwaisi #UttarPradeshElections2022 pic.twitter.com/3fvHdJs1UI
ఏం జరిగింది?
ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్ల కాల్పులు జరిపారు.
" యూపీ మేరట్‌లోని కిథౌర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని నేను దిల్లీకి వెళ్తోన్న సమయంలో నా వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు గుంపుగా వచ్చారు. ఇద్దరు కాల్పులు చేశారు. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దీంతో నేను మరో వాహనంలో వెళ్లిపోయాను. "
ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
దర్యాప్తునకు విజ్ఞప్తి..
కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోదీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తానన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఇదంతా డ్రామా..
ఓవైసీపై జరిగిన దాడిపై యూపీ భాజపా కీలక వ్యాఖ్యలు చేసింది. సానుభూతి కోసమే ఓవైసీ ఈ దాడి చేయించుకుని ఉంటారని ఆరోపించింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే ఈ డ్రామా చేసినట్లు విమర్శించింది. అయితే ఈ వ్యాఖ్యలను ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసి ఎవరు డ్రామాలు ఆడుతున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.
Also Read: CM Channi Nephew Arrest: పంజాబ్ సీఎం చన్నీకి ఈడీ షాక్.. మేనల్లుడు భూపేందర్ సింగ్ అరెస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)