News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Channi Nephew Arrest: పంజాబ్ సీఎం చన్నీకి ఈడీ షాక్.. మేనల్లుడు భూపేందర్ సింగ్ అరెస్ట్

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్ చేసింది.

FOLLOW US: 
Share:

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని అరెస్ట్ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాల కేసులో మనీలాండరింగ్ ఆరోపరణలపై భూపేందర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.

ప్రశ్నించి..

ఈ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ.. భూపేందర్‌ను తమ కార్యాలయానికి గురువారం పిలిచింది. కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది. జలంధర్ కోర్టులో ఈరోజు భూపేందర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

జనవరి 23నే భూపేందర్‌ను ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఆరోగ్య కారణాలు చెప్పి భూపేందర్ హాజరకుకాలేదు. నిన్న హాజరుకాగా ఈడీ అరెస్ట్ చేసింది.

ఈడీ దాడులు..

చన్నీ మేనల్లుడు అయిన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడం వల్ల ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన పలు ఇళ్లపై జనవరి 18న ఈడీ దాడులు జరిపింది ఈడీ. రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

కీలక సమయంలో..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం మేనల్లుడు అరెస్ట్ కావడం చన్నీని, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేలా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే భాజపా, ఆమ్‌ఆద్మీ ఈ కేసులో చన్నీకి కూడా భాగముందని ఆరోపణలు చేస్తున్నాయి.

కెప్టెన్ అమరీందర్ సింగ్.. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత చన్నీ ఆ బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలలుగా ఆయన సీఎం పదవిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును ఈ నెల 6న పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, చన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో చన్నీకి ఇది ప్రతికూలాంశంగా మారే అవకాశం ఉంది.

Published at : 04 Feb 2022 12:03 PM (IST) Tags: CONGRESS Charanjit Singh Channi punjab elections Punjab Elections 2022 Elections 2022 Punjab Assembly elections Bhupinder Singh Honey

ఇవి కూడా చూడండి

బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి

బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి

YS Sharmila: డబ్బా కొట్టడం కాదు! దమ్ముంటే ఆ సీట్లు మహిళలకు కేటాయించండి: మంత్రి కేటీఆర్ కు షర్మిల సవాల్

YS Sharmila: డబ్బా కొట్టడం కాదు! దమ్ముంటే ఆ సీట్లు మహిళలకు కేటాయించండి: మంత్రి కేటీఆర్ కు షర్మిల సవాల్

KTR On Congress Guarantees: 200 పింఛన్ ఇవ్వనోళ్లు 4 వేలు ఇస్తరంటా, నమ్మితే 48 గంటల కరెంట్ అంటరు: మంత్రి కేటీఆర్

KTR On Congress Guarantees: 200 పింఛన్ ఇవ్వనోళ్లు 4 వేలు ఇస్తరంటా, నమ్మితే 48 గంటల కరెంట్ అంటరు: మంత్రి కేటీఆర్

Lok Sabha Delimitation: మహిళా రిజర్వేషన్ కోసం లోక్‌సభ స్థానాలు పెంచుతారా- కేంద్రం ఏం ఆలోచిస్తోందీ?

Lok Sabha Delimitation: మహిళా రిజర్వేషన్ కోసం లోక్‌సభ స్థానాలు పెంచుతారా- కేంద్రం ఏం ఆలోచిస్తోందీ?

పొత్తు సూపర్‌ హిట్ అవుతుందన్న టీడీపీ, జనసేన లీడర్లు- 2019 ఎన్నికల గణాంకాలు విశ్లేషిస్తున్న నేతలు

పొత్తు సూపర్‌ హిట్ అవుతుందన్న టీడీపీ, జనసేన లీడర్లు- 2019 ఎన్నికల గణాంకాలు విశ్లేషిస్తున్న నేతలు

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?