జైల్లో నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు, తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచే అరవింద్ కేజ్రీవాల్ తొలి ఉత్తర్వులు జారీ చేశారు.
Arvind Kejriwal Order: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో (Delhi Liquor Policy Scam) అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో (Kejriwal Arrest) ఉన్నారు. మూడు రోజులుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. తాను ఎక్కడ ఉన్నా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తానంటూ ఇటీవల కేజ్రీవాల్ (Arvind Kejriwal News) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన జైల్‌లో నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. జైలుకి వెళ్లిన తరవాత తొలి ఉత్తర్వులను జారీ చేశారు. నీటి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ ఢిల్లీ మంత్రి అతిషికి ఆ నోట్‌ని పంపారు కేజ్రీవాల్. ఈ నోట్ వచ్చిన కాసేపటికే ఆమె ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం వెల్లడించారు.
"ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిటీలోని నీటి సరఫరాపై ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉందని తెలుసుకుని అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఏయే ప్రాంతాల్లో అయితే సమస్య ఉందో అక్కడ సరిపడా వాటర్ ట్యాంక్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన గురించి ఆలోచించడంలేదు. ఢిల్లీ ప్రజల సమస్యల గురించే ఆరా తీస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఢిల్లీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు"
- అతిషి, ఢిల్లీ మంత్రి
Delhi CM Arvind Kejriwal sends order from ED custody to Water Minister Atishi. https://t.co/FcceGPK5Yx pic.twitter.com/iZs4PzHhhR
— ANI (@ANI) March 24, 2024
మార్చి 21వ తేదీన సాయంత్రం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఆ తరవాత అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఢిల్లీలో అలజడి కొనసాగుతూనే ఉంది. ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈడీ ఆఫీస్‌కి వెళ్లే దారుల్ని అధికారులు మూసేశారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఈడీ నేతలు మండి పడుతున్నారు. అటు కేజ్రీవాల్ తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నరు. అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ముందు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ తరవాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. రిమాండ్‌తో పాటు అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
#WATCH | Delhi Water Minister Atishi addresses a press conference and reads out the order sent by Delhi CM Arvind Kejriwal for the Water Department.
— ANI (@ANI) March 24, 2024
She says, "Even in such a situation, he is not thinking about himself, but the people of Delhi and their problems..." pic.twitter.com/rrmWP1Ac8P
Also Read: అరెస్ట్‌ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్, తక్షణమే విడుదల చేయాలని పిటిషన్