News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Goa Polls 2022: గోవాలో కేజ్రీవాల్ ఇంటింటి ప్రచారం.. ముందు దిల్లీ సంగతి చూసుకోమని శివసేన కౌంటర్

ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. గోవా ఎన్నికల ప్రచారం బిజీబిజీగా ఉన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

FOLLOW US: 
Share:

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గోవాలో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న కేజ్రీవాల్.. తిరిగి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

" గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని గోవా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిపాలిస్తోన్న రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారు. గోవా మార్పు కోరుకుంటోంది.                                               "
-అరవింద్ కేజ్రీవాల్, ఆమ్‌ఆద్మీ అధినేత

శివసేన విమర్శలు.. 

అరవింద్ కేజ్రీవాల్.. గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహించడంపై శివసేన విమర్శలు చేసింది. దిల్లీలో కరోనా కేసులు పెరుగుతోంటే సీఎం కేజ్రీవాల్ గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

" దిల్లీలో కరోనా కేసులు ఘోరంగా పెరుగుతోంటే సీఎం కేజ్రీవాల్ గోవాలో డోర్-టు-డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దేనికోసం ఇదంత? గోవాలో మా పార్టీ చాలా బలంగా ఉందని కేజ్రీవాల్ అంటున్నారు. అలా అయితే ఇంక ప్రచారం దేనికి? ఆయన అవసరం గోవా కంటే దిల్లీకే ఎక్కువ ఉంది.                                               "
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
 
గట్టి పోటీ..
 
అరవింద్ కేజ్రీవాల్.. ఇతర రాష్ట్రాల్లో ఆమ్‌ఆద్మీని విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఆప్ ప్రతిపక్షంగా ఉంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, ఉత్తరఖండ్‌.. ఇలా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేశారు. ముఖ్యంగా గోవాలో కీలక హామీలు ప్రకటిస్తున్నారు. 

గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ ఆధార్ ఆదాయాన్ని నెలకు 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతామన్నారు.  

Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Jan 2022 06:22 PM (IST) Tags: Arvind Kejriwal Goa Sanjay Raut door-to-door campaign Goa Polls 2022 Shivsena

ఇవి కూడా చూడండి

Indian Army: ఆర్మీ 'అగ్నివీర్‌' తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Indian Army: ఆర్మీ 'అగ్నివీర్‌' తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Women Deaths: ఖమ్మంలో ఇంటర్‌ స్టూడెంట్‌ మృతి- విశాఖలో నగ్నంగా కనిపించిన మహిళ డెడ్ బాడీ!

Women Deaths: ఖమ్మంలో ఇంటర్‌ స్టూడెంట్‌ మృతి- విశాఖలో నగ్నంగా కనిపించిన మహిళ డెడ్ బాడీ!

NITW: వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే

NITW: వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే

Rajahmundry Road cum Rail Bridge: సెప్టెంబర్ 27 నుంచి రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి మూసివేత, ఎప్పటివరకంటే!

Rajahmundry Road cum Rail Bridge: సెప్టెంబర్ 27 నుంచి రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి మూసివేత, ఎప్పటివరకంటే!

టాప్ స్టోరీస్

IND Vs AUS: వార్ వన్‌సైడ్ - రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగులతో భారత్ విజయం!

IND Vs AUS: వార్ వన్‌సైడ్ - రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగులతో భారత్ విజయం!

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?