Apple Airpods 4: మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో వచ్చిన ఆపిల్ ఎయిర్‌పాడ్స్- మీ వినికిడి శక్తి ఎంతో ఐదు నిమిషాల్లో చెప్పేస్తుంది!
Apple Airpods 4 Launched: ఆపిల్ కొత్త ఎయిర్‌పాడ్‌లను లాంచ్ చేసింది. ఈ ఎయిర్‌పాడ్స్‌లో అనేక ఆధునిక ఫీచర్లను ఆపిల్ కంపెనీ తీసుకొచ్చింది.
Apple Airpods 4 Launched: కొత్త ఎయిర్‌పాడ్‌లను ఆపిల్ కంపెనీ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఎయిర్‌పాడ్స్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్లు జోడించింది. ఈ లేటెస్ట్ వెర్షన్ Apple AirPods 4లో సూపర్ పవర్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని వల్ల సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ లబిస్తుంది. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో లభించనుంది. ఆపిల్ కొత్త ఎయిర్‌పాడ్‌లలో అద్భుతమైన ఆకట్టుకునే కేస్ డిజైన్ తీసుకొచ్చింది.
Apple Airpods 4 స్పెసిఫికేషన్‌లు
Apple iPods 4లో కొత్త Siri ఫీచర్ ఉంది, దీని సహాయంతో మీరు మీ తలను పైకి క్రిందికి కదిలించడానే వచ్చిన ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వొచ్చు. డిస్‌కనెక్ట్ కూడా చేయవచ్చు. 30 గంటలపాటు AirPods 4ను కంటిన్యూగా వాడుకోవచ్చు. సుదీర్ఘ బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. ఈ AirPods 4కి స్పోర్ట్స్ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. Apple H2 చిప్‌ను AirPods 4లో అమర్చారు. దీంతో AirPods 4 అద్భుతమైన పనితీరు కనబరుస్తాయి.
ఈ కొత్త పరికరంలో యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ కూడా అందిస్తోంది ఆపిల్. ఇప్పుడు ప్రో మోడల్‌లో ట్రాన్సపరెన్సీ మోడ్‌ను కూడా తీసుకొచ్చింది. AirPods 4 వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. దీన్ని ఆపిల్ వాచ్ ఛార్జర్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు.
Also Read: అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో ఆపిల్ వాచ్ 10 సిరీస్ విడుదల- ఇండియాలో ధర ఎంత అంటే?
ధర ఎంత
Apple Airpods 4 ధరను 129 డాలర్లుగా ఆపిల్ సంస్థ నిర్ణయించింది. ఇది భారతీయ రూపాయలలో సుమారు 10 వేల రూపాయలు. యాంటీ-నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న AirPods 4 ధర 179 డాలర్లుగా చెబుతోంది. ఇండియన్ కెరన్సీలో దాదాపు 15 వేల రూపాయలు ఉంటుంది.
Apple AirPods 4తో పాటు కొత్తగా Apple AirPods Maxని కూడా విడుదల చేసింది ఆపిల్. ఇందులో ఎలాంటి అప్‌గ్రేడ్‌లు లేనప్పటికీ కొత్త రంగుల్లో దీన్ని విడుదల చేసింది. మిడ్‌నైట్ బ్లూ, పర్పుల్ ఆరెంజ్, స్టార్‌లైట్ వంటి మూడు రంగుల్లో ఈ వెర్షన్ వస్తోంది. ఇది కాకుండా iOS 18 USB-టైప్ C పోర్ట్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీ ఈ కొత్త హెడ్‌ఫోన్‌లో స్పేషియల్ ఆడియో సిస్టమ్‌ను కూడా అందించింది. దీని ధరను $549 అని చెబుతోంది. దీని ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభించేసింది. దీని డెలివరీ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభిస్తుంది.
Also Read: ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్ ఫీచర్‌తో వచ్చిన కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ధర మామూలుగా లేదు!
ఎయిర్‌పాడ్స్ ప్రో 2
Apple AirPods 4తో పాటు AirPods Pro 2ని కూడా విడుదల చేసింది ఆపిల్. బధిరులకు ఎంతో సౌకర్యంగా ఉండేలా ఈ కొత్త డివైజ్‌లో కొత్త ఫీచర్‌ను అందించింది. ఇందులో కొత్త హియరింగ్ ప్రొటెక్షన్ ఫీచర్ అందించింది. దీని సహాయంతో ఎయిర్‌పాడ్‌లు గట్టిగా ఉండే సౌండ్స్‌ను మృదువైన శబ్దాలను బ్యాలెన్స్ చేసి వినిపిస్తుంది. చెవి సమస్యలు ఉన్నవారు లేదా పెద్ద శబ్దం వల్ల చెవుల్లో నొప్పి ఉన్నవారి కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చింది.
ఈ కొత్త పరికరంలో వినికిడి పరీక్ష ఫీచర్ కూడా అందిస్తోంది. ఇది 5 నిమిషాల్లో పరీక్ష చేసి ఫలితాలు చూపుతుంది. మీరు ఈ ఫలితాన్ని మీ వైద్యుడికి చూపించి సలహా పొందవచ్చు. ఈ పరికరం చెవి రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.