AP Telangana Today Updates: గాంధీ ఆసుపత్రిలో దారుణం... అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం!
గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం చేశారని చిలకలగూడ పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు.
LIVE
Background
తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేయనున్నారు.
గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కా, చెల్లెళ్లపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం!
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఉమామహేశ్వర్‌రావు అనే ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసినట్టు బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కచెల్లెళ్లను గదిలో బంధించి మత్తు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు. గది నుంచి తప్పించుకున్న చెల్లి, అక్క ఆచూకీ ఇంకా తెలియాల్సిఉంది.
టీఎంసీలో చేరిన సుస్మితా దేవ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ.. అంతలోనే మరో కండువా
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సుష్మితా దేవ్ టీఎంసీలో చేరిపోయారు. అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన సుష్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. నేటి ఉదయం రాజీనామా లేఖను పంపిన ఆమె మధ్యాహ్నం టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
Kolkata, West Bengal: Sushmita Dev, who resigned from Congress today, joins TMC in the presence of party leaders Abhishek Banerjee and Derek O'Brien. pic.twitter.com/4KFNVKm3V8
— ANI (@ANI) August 16, 2021
ట్రైబ్యునళ్ల ఏర్పాటులో జాప్యం.. కేంద్రంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం
ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడం, సభ్యుల నియామకాలలో ఏడాది నుంచి చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, ట్రైబ్యునళ్ల ఏర్పాటును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
నారా లోకేశ్ అరెస్టు
రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదు. మధ్యాహ్నం కూడా పడుకుంటున్నాడు జగన్ రెడ్డి గారు. రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుంది.’’ అని నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
యూఎస్ ఓపెన్ 2021 గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకున్న రోజర్ ఫెడరర్
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూఎస్ ఓపెన్ 2021 గ్రాండ్‌స్లామ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. వింబుల్డన్ ఆడుతున్న సమయంలో మరోసారి గాయం పెద్దది కావడంతో ఫెడరర్ యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. గాయాల వల్లే తాను టోక్య ఒలింపిక్ గేమ్స్ నుంచి వైదొలిగిన విషయాన్ని గుర్తు చేశాడు. స్విస్ మాస్టర్‌కు త్వరలో మోకాలికి సర్జరీలు జరగనున్నాయి. వయసు మీద పడటంతో మునుపటిలా ప్రదర్శన చేయడం కష్టమవుతుందని ఫెడరర్ వ్యాఖ్యానించాడు.