అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి, 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి, 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ 

Background

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఇది మరో మేలిమలుపు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే ఇస్రో చేపట్టింది. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపినా, రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే. అంటే పూర్తిగా ఇది ప్రైవేట్ ప్రయోగం. దీనికి కేవలం ఇస్రో లాంఛింగ్ ప్యాడ్ ని మాత్రమే వినియోగిస్తున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్ లకు అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో. దీనిలో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ ఈ రాకెట్‌ను రూపొందించింది. ఇస్రో, ఇన్‌ స్పేస్‌ సహకారంతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరుగుతోంది. తొలిసారిగా పంపే రాకెట్ పేరు ప్రారంభ్. ప్రారంభ్‌ పేరుతో విక్రమ్‌-ఎస్‌ రాకెట్లను వరుసగా పంపేందుకు స్కైరూట్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటోంది.

తొలి రాకెట్‌ ద్వారా స్పేస్‌ కిడ్స్‌ ఇండియా (ఇండియా-తమిళనాడు), బజూమ్‌ క్యూ (ఆర్మేనియా), ఎన్‌-స్పేస్‌ టెక్‌ (ఇండియా-ఏపీ)కి చెందిన మూడు పేలోడ్ లను నింగిలోకి పంపిస్తారు.

విక్రమ్ -ఎస్1 రాకెట్ విశేషాలు..

బరువు – 545 కిలోలు
పొడవు – 6 మీటర్లు
పేలోడ్‌ సామర్థ్యం – 83 కిలోలు

ప్రయోగం మొదలయ్యే సమయం 11.30 గంటలు

పూర్తయ్యే సమయం 11.35 గంటలు

విక్రమ్-ఎస్ రాకెట్‌ మొత్తం మూడు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వీటిలో రెండు భారత్ కు చెందినవి కాగా, మూడోది విదేశీ సంస్థది. ఈ రాకెట్‌ కు సంబంధించిన ఫుల్ డ్యూరేషన్ టెస్ట్‌ మేలో విజయవంతంగా పూర్తి చేశారు. విక్రమ్-ఎస్ ప్రయోగం నవంబర్ 12-16 మధ్య జరగాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈరోజు (నవంబర్ 18)కి వాయిదా వేశారు.

సరిగ్గా ఈ ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదికనుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం 4 నిమిషాల 50 సెకన్లకు ముగుస్తుంది.

విక్రమ్-ఎస్ రాకెట్ 81.5 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ప్రయాణిస్తుంది. అక్కడ భూ స్థిర కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశ పెడుతుంది. అక్కడినుంచి తిరిగి రాకెట్ సముద్రంలో పడిపోతుంది. శ్రీహరికోటకు 115.8 కిలోమీటర్ల దూరంలో రాకెట్ సముద్రంలో పడిపోతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. జాలర్లను వేటకు వెళ్లకుండా నిషేధించారు.

వాస్తవానికి శ్రీహరికోట షార్ కేంద్రంలో రాకెట్ ప్రయోగం అంటే శాస్త్రవేత్తలు హడావిడిగా కనిపిస్తారు. ఇస్రో చైర్మన్ రాకెట్ నమూనాతో తిరుమల, సూళ్లూరుపేటలోని ఆలయాల్లో పూజలు చేయిస్తుంటారు. కానీ ఈసారి ఆ హడావిడి లేదు. ఇది పూర్తిగా ప్రైవేటు ప్రయోగం. అంటే ప్రైవేటు సంస్థకు కావల్సిన వసతులు మాత్రమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సమకూర్చింది. మిగిలివన్నీ ఆ సంస్థ నిర్వాహకులే ఏర్పాటు చేసుకున్నారు. కేవలం ఆ ప్రాంతంలో పనిచేసే వారు తప్ప మిగిలిన వారిని ఎవరిని రాకెట్‌ ప్రయోగం చేపట్టే సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్ కి రానివ్వడంలేదు అధికారులు. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌ షార్‌ కు వచ్చారు.

22:31 PM (IST)  •  18 Nov 2022

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి, 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ 

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై జరిగిన దాడిపై ఆయన తల్లి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 452,148,427,323,354, r/w 149 ipc సెక్షన్ల్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

22:09 PM (IST)  •  18 Nov 2022

బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. బండి సంజయ్, డీకే అరుణతో భేటీ అయిన మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. 

19:12 PM (IST)  •  18 Nov 2022

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 11 మంది మృతి!

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. చమేలి వద్ద ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. 

15:57 PM (IST)  •  18 Nov 2022

విశాఖ భీమిలి బీచ్ లో విషాదం, ఇద్దరు విద్యార్థులు గల్లంతు 

విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. తగరపువలస అనిట్స్ కాలేజీకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.  విద్యార్థుల కోసం నేవీ హెలికాప్టర్, నేవికి చెందిన మూడు స్పీడ్ బోట్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి. విద్యార్థుల గల్లంతు సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాలేజీకి లేట్ కావడంతో ఉదయం 11.30కి ఏడుగురు విద్యార్థులు భీమిలి బీచ్ కు వచ్చారు. 4 గురు బీచ్ లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లగా లోతు ఉన్న ప్రాంతంలో సూర్య అనే విద్యార్థి మునిగిపోయాడు. సూర్యను కాపాడేందుకు వెళ్లిన సాయి కూడా గల్లంతయ్యాడు. 

16:05 PM (IST)  •  18 Nov 2022

వెస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా కాలేజీలో విషవాయువులు లీక్, 10 మంది విద్యార్థులకు అస్వస్థత 

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా కళాశాలలో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీకై విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.  కళాశాల ప్రయోగశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులను గాంధీ హాస్పిటల్ తో పాటు స్థానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు. 

12:56 PM (IST)  •  18 Nov 2022

హాస్టల్స్ కోసం విద్యార్థుల ఆందోళన- ఓయూలో ఉద్రిక్తత

ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్స్ వెంటనే కేటాయించాలంటూ విద్యార్థుల ఆందోళ చేపట్టారు. ఓయూ పరిపాలనా భవనంలోకి చొచ్చుకు వచ్చిన విద్యార్థులు వీసీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి విద్యార్థులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. దీంతో పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య తోపులాటలో విద్యార్థు గాయపడ్డారు. 

12:56 PM (IST)  •  18 Nov 2022

హాస్టల్స్ కోసం విద్యార్థుల ఆందోళన- ఓయూలో ఉద్రిక్తత

ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్స్ వెంటనే కేటాయించాలంటూ విద్యార్థుల ఆందోళ చేపట్టారు. ఓయూ పరిపాలనా భవనంలోకి చొచ్చుకు వచ్చిన విద్యార్థులు వీసీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి విద్యార్థులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. దీంతో పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య తోపులాటలో విద్యార్థు గాయపడ్డారు. 

12:09 PM (IST)  •  18 Nov 2022

బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి


బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. భారీగాా అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో అదుపు చేయడం క్షష్టంగా మారింది. అక్కడకి చేరుకొని వ్యతిరేక నినాదాలు.. ఇంటి అద్దాలు పగులగొట్టారు.

11:02 AM (IST)  •  18 Nov 2022

ఈడీ విచారణకు హాజరైన ఎల్ రమణ

క్యాసినో కేసులో దర్యాప్తును ఈడీ స్పీడప్ చేసింది. రెండోరోజు వరుసగా పలువురు ప్రజాప్రతినిధులను విచారిస్తోంది. ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు దర్యాప్తునకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు. బ్యాంకు స్టేట్‌మెంట్లతో ఈడీ ముందుకు వచ్చారరు రమణ. విదేశాల్లో ఆయన క్యాసినో ఆడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 

 

07:50 AM (IST)  •  18 Nov 2022

గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 :40 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది....ట్రైన్ లో  కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు  మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు....వెంటనే రైల్వే అధికారులు  గూడూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ను ఆపి  మంటలను అదుపులోకి తెచ్చారు....ఈ ఘటన తో ట్రైన్ సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది....మంటలను అదుపులోకి వచ్చిన తర్వాత ట్రైన్ ను చెన్నై కు పంపారు.. రైల్వే  అధికారులు అప్రమత్తం అవడం తో తప్పిన భారీ ప్రమాదం తప్పింది....ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రైల్వే అధికారులు.......ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదని విచారిస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు....

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Top Headlines: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Top Headlines: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Hanuman Jayanti 2024: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
KTR Comments: మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తారట - కేటీఆర్, మే 10న అక్కడ కేసీఆర్ రోడ్‌ షో
మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తారట - కేటీఆర్, మే 10న అక్కడ కేసీఆర్ రోడ్‌ షో
RR vs MI: య‌శ‌స్వీ అద్భుత శతకం, ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
య‌శ‌స్వీ అద్భుత శతకం, ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్‌, ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడుగా యుజీ!
చరిత్ర సృష్టించిన చాహల్‌, ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడుగా యుజీ!
Embed widget