అన్వేషించండి

 Breaking News : ఫిజికల్ ఈవెంట్స్- గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
 Breaking News : ఫిజికల్ ఈవెంట్స్- గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్‌

Background

ఇటీవల ఓ మీడియా హౌస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన కామెంట్స్ చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్‌ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌ క్రికెట్‌ సెలక్షన్‌లపై, ఆటగాళ్ల మధ్య ఉన్న విభేదాలు, ఫిట్‌నెస్‌ చాలా ఆసక్తికరమైన అంశాలను చేతన్ శర్మ బయటపెట్టారు. ఇది భారత్‌ క్రికెట్‌నే ఊపేసింది.

ఇంతకీ చేతన్ చేసిన కామెంట్స్ ఏంటీ?

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ ఇండియన్ క్రికెట్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఓ మీడియా హౌస్‌ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి చేసిన ఆరోపణలు క్రిడాలోకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఫిట్‌నెస్‌ సాధించడానికి క్రికెటర్లు ఇంజెక్షన్‌లు తీసుకుంటారనే సంచలన విషయాలు బయటపెట్టారు. వాళ్లు తీసుకునే ఇంజక్షన్లు డోపింగ్ టెస్టుల్లో కూడా దొరకవని తెలిపారు. చాలా మంది పూర్తిగా ఫిట్‌నెస్‌ లేకపోయినా మ్యాచ్‌కు ముందు ఇంజక్షన్‌లు తీసుకుంటారని తెలిపారు. 80 శాతం ఫిట్‌గా ఉన్నవాళ్లు కూడా ఈ మెడిసిన్ తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తారని వివరించారు. ఇలా చాలా మంది మ్యాచ్‌లు ఆడుతున్నారన్నారు. 

ఇంజక్షన్‌లు తీసుకొని మ్యాచ్‌లు ఆడుతారనే దానికి ఎగ్జాంపుల్స్‌ కూడా చేతన్ శర్మ వివరించారు. ఫేక్‌ఫిట్‌నెస్‌ గేమ్‌లో చాలా బడా క్రికెటర్లు ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కిందకు వంగలేని ఓస్టార్‌ ప్లేయర్‌ కూడా ఇలానే ఫిట్‌నెస్‌ సాదించాడని స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పుకొచ్చాడు. 

గంగూలి, కొహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలపై కూడా నోరు విప్పారు చేతన్ శర్మ. గంగూలీ, కోహ్లీకి అసలు పడదని తెలిపారు. తనను కెప్టెన్‌గా తప్పించడంలో ఆయన పాత్ర చాలా ఉందని భావించిన కోహ్లీ... ఆ పేరు వింటేనే మండిపడతారన్నారు. ఓ సెలెక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్‌పై పునరాలోచించాలని గంగూలి చెప్పి ఉంటాడని.. అందుకు కోహ్లీ కుదరదని చెప్పి ఉంటారని చేతన్ తెలిపారు. తనను తప్పించడంపై కోహ్లీ ఓ ప్రెస్‌మీట్‌ పెట్టాలని భావించినప్పటికీ ఎందుకో ఆ పని చేయలేదన్నారు. అయినా... తనను గంటన్నర ముందే కెప్టెన్సీ నుంచి తప్పించారని 2021 దక్షిణాఫ్రికా పర్యటనలో చెప్పిన సంగతి గుర్తు చేశారు. మొదటి నుంచి కోహ్లీ తీరు గంగూలీకి నచ్చదని... సమయం కోసం చూసిన దాదా... రోహిత్ శర్మకు ఓటు వేశారన్నారు.  

రోహిత్‌ శర్మ, కోహ్లీ మధ్య ఇగో క్లాష్‌ ఉందన్నారు చేతన్ శర్మ. ఒకరు రోహిత్‌ అమితాబ్‌, కోహ్లీ ధర్మేంద్రలా ఫీల్ అవుతారన్నారు. జట్టులో విరాట్‌, రోహిత్ వర్గాలు ఉండేవన్నారు. కోహ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం రోహిత్ అండగా ఉన్నాడని వివరించారు. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే విరాట్, రోహిత్ నుంచి టీ 20 ఫార్మాట్‌ నుంచి తప్పించినట్టు తెలిపారు చేతన్‌ శర్మ. ఇక భవిష్యత్‌లో కూడా వీళ్లకు అవకాశాలు రాకపోవచ్చని కూడా కుండబద్దలు కొట్టారు. 

 చేతన్ శర్మ చేసిన కామెంట్స్‌ తీవ్రమైనవి కావడంతో ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీంతో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జే షాకు పంపించారు. లేఖను పరిశీలించిన బీసీసీఐ దిద్దుబాటులో భాగంగా రాజీనామాను ఆమోదించింది. 

16:56 PM (IST)  •  17 Feb 2023

ఏపీఎస్ఎల్ పీఆర్బీ ఎస్ఐ ఉద్యోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి: ఏపీఎస్ఎల్ పీఆర్బీ ఎస్ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాంమని తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి తెలిపారు.. శుక్రవారం తిరుపతి ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎపిఎస్ఎల్ పి ఆర్ బి ఎస్.ఐ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాంమన్నారు.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.. తిరుపతి నగరంలో 21పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాంమని, మొత్తం 12,799మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు.. 19వ తేదీ ఆదివారం పరీక్షలను నిర్వహిస్తున్నాంమని, పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్లతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన కోరారు.. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా, పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వంమని హెచ్చరించారు.. అభ్యర్థులు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాంమని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు..

16:55 PM (IST)  •  17 Feb 2023

శ్రీ విద్యాస్ వికలాంగుల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్.. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శైలజ ఆర్యన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహేంద్ర హిల్స్ లోని శ్రీ విద్యాస్ వికలాంగుల కేంద్రంలో పిల్లల తో కలిసి కేక్ కట్ చేశారు. కెసిఆర్ జన్మదిన సందర్భంగా శైలజ ఆర్యన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు.. అనంతరం దివ్యంగులు చేసిన నృత్యాలు నాటికలు అందర్నీ అలరింపజేశాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్తున్నారని అన్నారు.. పేదవారికి సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశ్యం తో ఫౌండేషన్ ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.. గతంలో దిశ ఘటన తనని ఎంతగానో కలిచి వేసిందని ఆమె అన్నారు.. ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని ఆర్థికంగా ఉన్నవారు లేనివారికి సహాయం చేయడం గొప్ప విషయమని అన్నారు..

16:47 PM (IST)  •  17 Feb 2023

దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టు ఎర్రబెల్లి - మంత్రికి వైఎస్ షర్మిల ఛాలెంజ్

మహబూబ్ బాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట - ముచ్చట

ఎమ్మెల్యే శంకర్ నాయక్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వైఎస్ షర్మిల సవాల్

నేను మానుకోట కొచ్చే సరికి ఈ ఎమ్మెల్యే భయం పట్టుకుంది

శంకర్ నాయక్ సైగ చెయ్యి చూద్దాం ఎవడు వస్తాడో చూస్తా

అడది అయితే మాట్లాడకూడద ఎర్రబెల్లి..?

నీకు దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టు ఎర్రబెల్లి - వైఎస్ షర్మిల

శంకర్ నాయక్ బుజాలు తడుముకుంటున్నారు

నేను అడుగు పెట్టగానే భయం పట్టుకుంది

శంకర్ నాయక్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడు

పాదయాత్రను అడ్డుకొనెలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు

ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తా అనే బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారు

ఒక్క సైగ చేస్తే కార్యకర్తలు మాపై దాడి చేస్తారట

శంకర్ నాయక్ కి వైఎస్సార్ బిడ్డ సవాల్

మీకు దమ్ముంటే దాడి చేయండి చూద్దాం

మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు YSR బిడ్డ

16:44 PM (IST)  •  17 Feb 2023

SI Constable Physical Events: ఫిజికల్ ఈవెంట్స్- గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్‌

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు తెలంగాణ పోలీసు నియామక మండలి మరో అవకాశం కల్పించింది. ప్రిలిమ్స్ లో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో అర్హత పొందాక ఫిజిలక్ పరీక్షల్లో పాల్గొనవచ్చని మినహాయింపు ఇచ్చింది.  అయితే ఇందులో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది. ఫిబ్రవరి 28లోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

16:43 PM (IST)  •  17 Feb 2023

Telangana Police Events: ముగిసిన మహిళా పోలీస్ అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్స్

ముగిసిన మహిళల దేహదారుడ్య పరీక్షలు 

 స్టయిఫండరి పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ల నియామకంలో భాగంగా  మూడవ రోజున మహిళా అభ్యర్థునులకు దేహ దారుడ్య పరీక్షలు జరిగాయి. కాకతీయ విశ్వ విద్యాలయం మైదానంలో  శుక్రవారం మహిళలకు నిర్వహించిన దేహాదారుద్య పరీక్షలకు 1268 మంది అభ్యర్థునులకుగాను 1004 మంది అభ్యర్థునులు హాజరుకాగా ఇందులో 523 మంది మహిళ అభ్యర్థునులు తుది పరీక్షకు అర్హత సాధించారు. ఈ దేహాదారుద్య పరీక్షలను వరంగల్  పోలీస్ కమిషనర్  ఏ. వి. రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేసారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ డి. మురళీధర్, అదనపు డీసీపీలు సురేష్, సంజీవ్ తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, కమ్యూనికేషన్, ఐటీ, మెడికల్ విభాగం కు చెందిన అధికారులు,  ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Tirumala Stampede Conspiracy : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Tirumala Stampede Conspiracy : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
Embed widget