IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Breaking News: పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..

FOLLOW US: 
పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం

పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కు నివేదిక అందించామని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. 72 గంటల్లో సీఎం జగన్ పీఆర్సీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. 
 

తమిళనాడు శ్రీరంగనాథ ఆలయంలో సిఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమిళనాడులోని ప్రసిద్ది చెందిన రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు తమిళనాడు మంత్రి అరుణ్‌ నెహ్రూ, కలెక్టర్‌ శ్రీనివాస్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన గజేంద్రుణికి ప్రత్యేక పూజలు చేశారు. 

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

 జగన్ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపి రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 ఛార్జ్‌షీట్లు విచారణలో ఉన్నాయని కోర్టుకు వివరించారు పిటిషనర్‌ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది.  బెయిల్‌ రద్దు చేసి ఆ ఛార్జ్‌ షీట్లపై విచారణ చేయాలని కోర్టుకు అభ్యర్థించారు. బెయిల్‌ రద్దుకు సంబంధించిన పిటిషన్‌ను ఇప్పటికే సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ చెప్పింది విన్న హైకోర్టు జగన్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు కరోనా వైరస్

బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు కరోనా సోకింది. అమృత అరోరాకు సైతం కొవిడ్ ఉన్నట్టు తేలింది. వీరిద్దరూ కరోనా నిబంధనలను ఉల్లంఘించి చాలా పార్టీలకు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు సూపర్ స్ప్రెడర్‌లుగా మారే అవకాశం ఉంది. కరీనా కపూర్, అమృతా అరోరాతో పరిచయం ఉన్న వ్యక్తులు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా ముంబయి అధికారులు ఆదేశించారు. 

సమంతకు అస్వస్థత

ప్రముఖ హీరోయిన్ సమంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈమె నిన్న కడపలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. కడప నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురయినట్లుగా తెలుస్తోంది. జలుబు, వైరల్ ఫివర్‌తో సమంత ఇబ్బందిపడుతున్నట్లుగా సమాచారం. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ అసుపత్రిలో చేరారు.

కొనసాగుతున్న ప్రధాని మోదీ కాశీ పర్యటన

ప్రధాని మోదీ కాశీ పర్యటన సాగుతోంది. గంగా న‌దిలో మోదీ పుణ్య స్నానం చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను జాతికి అంకితం చేసేందుకు కాశీలో ప‌ర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా.. ల‌లితా ఘాట్ వ‌ద్ద మోదీ జ‌ల‌త‌ర్పణం చేశారు. గంగా మాత‌కు పుష్పాలు అర్పించారు. సూర్య భ‌గ‌వానుడికి పూజ‌లు చేశారు. మంత్రోచ్ఛర‌ణ చేస్తూ గంగాదేవికి స‌మ‌ర్పణ చేశారు. కాషాయ వ‌స్త్రాల్లో.. గంగా జ‌లాన్ని తీసుకుని ఆయ‌న బాబా విశ్వనాథుడి వ‌ద్దకు వెళ్లారు. విశ్వనాథుడికి ఆ జ‌లంతో అభిషేకం చేస్తారు.

రాజకీయ లబ్ధి కోసమే జోనల్ పాలసీ: బండి సంజయ్

జోనల్ విధానం తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ప్రమోషన్లు దక్కక ఇబ్బంది పడుతున్నారని, అలాంటివారిని మరింతగా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. పాత సమస్యను దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరపైకి తెస్తూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడపుకుంటుండడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాసేపట్లో చెన్నైకి బయలుదేరనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపట్లో చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన చెన్నైలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ రాత్రికి చెన్నైలోనే బస చేసి ఆయన రేపు ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే, ఈ భేటీపై అధికారిక సమాచారం లేదు.

రెండు లారీలు ఢీ.. క్లీనర్ దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలోని క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో లారీ రోడ్డు ప్రక్కనే ఉన్న పూల దుకాణాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

43వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

రాజధాని ప్రాంత రైతుల చేపట్టిన మహాపాదయాత్ర నేడు 43వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం 8:30 గంటలకు రేణిగుంటలో రైతులు తమ పాదయాత్రను ప్రారంభించారు. ఆటోనగర్‌లో మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం రామానాయుడు కళ్యాణమండపం ప్రాంతంలో నేటి పాదయాత్ర ముగియనుంది. ఈ రోజు రైతులు దాదాపు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించనున్నారు.

Background

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి వర్షాలు కురవనుండగా.. రేపు కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
నైరుతి బంగాళాఖాతంలో వీస్తున్న చల్ల గాలుల ప్రభావం కొంతమేర తెలంగాణలోనూ ఉంది. అయితే రాష్ట్రంలో ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పడిపోతాయని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,110 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,210 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 13) రూ.0.27 పైసలు తగ్గి పెట్రోల్ ధర రూ.107.69 గా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.0.25 పైసలు తగ్గి రూ.94.14 గా ఉంది.  
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.95గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.59 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.96.01గా ఉంది. ఇది రూ.0.54 పైసలు పెరిగింది. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.15 పైసలు పెరిగి రూ.110.36 గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.96.45గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Right To Dignity: సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !

Right To Dignity:  సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !