News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా

AP News: ఇంధన పొదుపు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా అవతరించింది. ఇంధన సంరక్షణ చర్యలతో నాలుగేళ్లలో రూ. 4 వేల కోట్లు ఆదా చేసింది.

FOLLOW US: 
Share:

AP News: ఇంధన పొదుపు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా అవతరించింది. ఇంధన సంరక్షణ, సామర్థ్య చర్యలు అమలు చేయడం ద్వారా రూ. 4 వేల కోట్లకు పైగా ఆదా చేసింది. గత నాలుగు నుండి ఐదేళ్లలో ఇంధన శాఖ పొదుపు చర్యల ద్వారా రూ.4,088 కోట్ల విలువైన సుమారు 5600 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ను ఆదా చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం డిమాండ్ 66 వేల మిలియన యూనిట్లలో 25 శాతం ఆదా చేయగలదు. రాష్ట్ర ఇంధన శాఖ 2030 నాటికి 11 వేల మిలియన్ యూనిట్లు ఆదా చేయడానికి ఎనర్జీ ఎఫిషియన్సీ చర్యలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని యోచిస్తోంది. అంటే సంవత్సరానికి 1700 మిలియన్ యూనిట్లను ఆదా చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంధన పొదుపు సామర్థ్యాన్ని వెలికి తీసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్(EC) సెల్ లను రూపొందించినట్లు ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖర రెడ్డి తెలిపారు. 

'విద్యుత్ ను సమర్థవంతంగా వాడటాన్ని ప్రోత్సహించడం, విద్యుత్ వాడకాన్ని, బిల్లులను వీలైనంత వరకు తగ్గించడమే ఎనర్జీ ఎఫిషీయన్సీ సెల్స్ ప్రధాన ఉద్దేశం. దీని వల్ల అన్ని శాఖలపై ఆర్థిక భారం తగ్గుతుంది. నివాస సముదాయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎకో నివాస్ సంహిత కోడ్ ను తీసుకువచ్చేందుకు యోచిస్తోంది. ఇంధన సామర్థ్య నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు గాను, PAT పథకం కింద కొత్త పరిశ్రమల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది' అని ఏపీఎస్ఈసీఎం మాజీ సీఈవో చంద్రశేఖర రెడ్డి తెలిపారు.

Also Read: కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

దేశంలోనే అత్యుత్తమ ఎనర్జీ ఎఫిషీయంట్ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీఎస్ఈసీఎం మాజీ సీఈవో చంద్రశేఖర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతుండటం వల్ల వచ్చే ఏదేళ్లు అత్యంత వేడిగా ఉంటాయని నివేదికలు చెబుతున్నట్లు చంద్రశేఖర రెడ్డి గుర్తు చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఎనర్జీ ఎఫిషీయంట్ 50 శాతం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎకాలజీ, ఎకానమీ, జీవన నాణ్యతకు ప్రయోజనం చేకూర్చడంలో ఎనర్జీ ఎఫిషియన్సీది ప్రధాన పాత్ర అని తెలిపారు. 2011-12 లో విద్యుత్ కోసం వేగంగా పెరిగిన డిమాండ్, డిమాండ్, సప్లై మధ్య అసమతుల్యత వల్ల రాష్ట్ర సర్కారు పొదుపు చర్యలు తక్షణ ప్రాతిపదికన అమలు చేసినట్లు తెలిపారు. 

2011లో ఎనర్జీ కో-ఆర్డినేషన్ సెల్ మెంబర్ సెక్రటరీగా చంద్రశేఖర రెడ్డి నియమితులయయ్యారు. ఆ తర్వాత ఏపీఎస్ఈసీఎం సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తన నాయకత్వంలో ఇంధన పొదుపును సాధించడంలో ఉత్తమ పనితీరు కనబరిచారు. అలా భారత రాష్ట్రపతి నుంచి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2022 తో సహా రాష్ట్రానికి ఐదు జాతీయ అవార్డులు రావడంలో కీలక భూమిక పోషించారు. జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులను చంద్రశేఖర రెడ్డి మూడుసార్లు అందుకున్నారు. రాష్ట్రంలో రూ. 412 కోట్ల విలువైన 30కి పైగా ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టులను గుర్తించడంలో చంద్రశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

Published at : 01 Jun 2023 02:36 PM (IST) Tags: AP 4 Thousand Crores Energy Conservation Efficiency Measures AP Saves

ఇవి కూడా చూడండి

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

BSF Seize Drugs: భారత్-బంగ్లా సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం, రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

BSF Seize Drugs: భారత్-బంగ్లా సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం, రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

Telangana News: 9999 నెంబర్ కు యమా క్రేజ్ - ఆర్టీఏకు అనేక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్లు

Telangana News: 9999 నెంబర్ కు యమా క్రేజ్ - ఆర్టీఏకు అనేక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్లు

Nipah Cases: కేరళలో సున్నా నిఫా కేసులు నమోదు, కోజికోడ్‌లో ఆంక్షల సడలింపు

Nipah Cases: కేరళలో సున్నా నిఫా కేసులు నమోదు, కోజికోడ్‌లో ఆంక్షల సడలింపు

Football Coach: బాలికను వేధించిన ఫుట్‌బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Football Coach: బాలికను వేధించిన ఫుట్‌బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు