అన్వేషించండి

AP BJP reaction : ఆస్తులను కాపాడుకోవడానికే కొత్త డ్రామా - వైసీపీ ఉమ్మడి రాజధాని డిమాండ్‌పై ఏపీ బీజేపీ ఆగ్రహం

AP BJP reaction : ఉమ్మడి రాజధాని అంశంపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ఖండించింది. ఆస్తులను కాపాడుకోవడానికే కొత్త డ్రామా అని ఆ పార్టీ నేత సత్యకుమార్ ఆరోపించారు.

AP BJP has condemned the comments made by YV Subbareddy :  ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి రాజధాని  అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఏపీ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ఖండించింది.  కేవలం హైదరాబాద్ ఉన్న జగన్ ఆస్తుల ని కాపాడుకోవడం కోసమే  సరికొత్త డ్రామా ప్రారంభించారని మండిపడ్డారు.  విభజన చట్టం పరిధి కూడా 10 సంవత్సరాలె. అది కూడా జగన్ కి తెలియదని విమర్శించారు.  ప్రతి సర్వేలో ను జగన్ కి వ్యతిరేకత కనిపిస్తోదన్నారు.  మొన్న అమరావతి రాజధాని..నిన్న మూడు రాజధానులు..ఇవ్ాళ  హైదరాబాద్ రాజధాని అంటున్నారని.. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు.  అమరావతి నాశనం చేసి 250 మంది చావు కి జగన్ కారణమని మండిపడ్డారు. 

నమ్మబలకడం, నయవంచనకు పాల్పడడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానానికి మద్దతు తెలిపారు. ఇంకా నమ్మించడం కోసం నేను అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నానని ఇంకా నమ్మబలికారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవన్నీ మర్చిపోయి మూడు రాజధానులు అంటూ కొత్త చర్చకు శ్రీకారం చుట్టారు. వైసీపీ నేతల ప్రధాన ఉద్దేశం దోచుకోవడం తప్పా.. ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న ఆలోచన లేదు. అమరావతిని నిర్మిస్తే ఎవరు అడ్డుపడ్డారు? అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు ప్రటించింది. 65 వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర సిద్ధపడిందని సత్యకుమార్ తెలిపారు.మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను మోసం చేశారని.. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే ?

విశాఖ రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగితే బాగుంటుందని  వైవీ సుబ్బారెడ్డి అన్నారు.   గత ప్రభుత్వంకూడా అమరావతిలో తాత్కాలిక రాజధానినే నిర్మించారని, రాజధాని నిర్మించే స్థోమత ప్రస్తుతం ఏపీలో లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడుతాయో తెలియదు.. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విశాఖ రాజధాని అయ్యేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని నా భావన అని సుబ్బారెడ్డి అన్నారు.

ఎన్నికల ముందు నుంచే విశాఖపట్టణం రాజధానిగా పాలన చెయ్యడానికి సిద్ధం ఉన్నాం.. కానీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ పని సాధ్యం కాలేదు. సీఎం జగన్ వచ్చి పరిపాలన చెయ్యాలంటే ఇక్కడి నుంచి చేస్తారు. కానీ, ఇక్కడ ఉద్యోగులు గురించి ఆలోచించాలి. ఈరోజుకీ హైదరాబాద్ నుంచే ఉద్యోగులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మనకంటూ ఓ రాజధాని లేదు.. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపాలన సాగించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కరోజులో విశాఖను రాజధానిగా తరలించలేము.. సీఎం ఒక్కడే ఉంటే సరిపోదు.. దానికి సంబంధించి సీఎంతో పాటు ఉద్యోగులు, అధికారులు రావాలి. వారికి సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండాలని కోరుతున్నాము. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. వచ్చే చట్టసభల్లో దీనిపై పోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 DC VS MI Result Update: గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP DesamRR vs RCB Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 9వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamTravis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 DC VS MI Result Update: గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
IPL2025 RCB VS RR Result Update: ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ
ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ
Actor: లుక్స్, కలర్ చూసి ఎగతాళి - కట్ చేస్తే రూ.వందల కోట్ల ఆస్తికి వారసుడు, ఈ స్టార్ హీరో గురించి తెలుసా?
లుక్స్, కలర్ చూసి ఎగతాళి - కట్ చేస్తే రూ.వందల కోట్ల ఆస్తికి వారసుడు, ఈ స్టార్ హీరో గురించి తెలుసా?
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Bhu Bharati Act: భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ సోమవారం జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ సోమవారం జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Embed widget