News
News
X

Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

Republic Day Celebrations 2023: ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్ సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. 

FOLLOW US: 
Share:

Republic Day Celebrations 2023: ఢిల్లీలో జరిగిన 30 రోజుల గణతంత్ర దినోత్సవ శిబిరానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బృందం సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చింది. ఇందులో ఒక ఆఫీసర్, 121 మంది క్యాడెట్లు, 10 మంది ఇతర సహాయక సిబ్బంది ఉన్నారు. శిబిరం సందర్భంగా జరిగిన వివిధ జాతీయ స్థాయి పోటీల్లో దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల నుంచి క్యాడెట్లు పాల్గొని సత్తా చాటారు.

సికింద్రాబాద్ జీపీ హెడ్ క్వార్టర్స్‌కు చెందిన ఎస్జీటీ జీ ప్రేమ్ కృతిక, ఎస్‌డబ్ల్యూ ఆర్మీ విభాగంలో బెస్ట్ క్యాడెట్‌గా ఎంపికై డైరెక్టరేట్‌కు గర్వకారణంగా నిలిచారు. 28 జనవరి 2023న పరేడ్ గ్రౌండ్, న్యూఢిల్లీ కరియప్పాలో నిర్వహించిన పీఎం ర్యాలీ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ద్వారా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీని అందుకున్నారు. బెస్ట్ క్యాడెట్ ఎస్డీ నావల్ వింగ్ విభాగంలో క్యాడెట్ అమోఘవర్దరాజ్ నాయుడు మూడవ స్థానంలో నిలవగా, క్యాడెట్ వి.శివ గణేష్, క్యాడెట్ సీహెచ్.నితీన్ సాయి వరుసగా బెస్ట్ క్యాడెట్ జేడీ ఆర్మీ & జేడీ నేవీ విభాగంలో నాల్గవ స్థానంలో నిలిచి డీజీ ఎన్సీసీ మెడలియన్‌ను అందుకున్నారు.

ఎన్‌సీసీ ఆర్డీసీ క్యాంప్-2023, 01 జనవరి 2023న న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో దేశవ్యాప్తంగా 2,155 మంది క్యాడెట్‌ల భాగస్వామ్యంతో ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. రక్షణ శాఖ మంత్రి, రక్షణ కార్యదర్శి, సాయుధ దళాల త్రివిధ దళాల అధిపతులు, ఢిల్లీ ముఖ్యమంత్రి సహా ఇతర ప్రముఖులు సందర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో ముగించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య మార్గ్‌లో మార్చి పాస్ట్‌లో పాల్గొన్న ఎన్‌సీసీ బాయ్స్, గర్ల్స్ కంటింజెంట్‌లో ఎన్‌సీసీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్‌కు చెందిన 9 మంది ఎస్డీ క్యాడెట్‌లు, 9 మంది ఎస్‌డబ్ల్యూ క్యాడెట్‌లు పాల్గొన్నారు. ఈ క్యాడెట్‌ల శిక్షణ సెప్టెంబరు నెలలో సబ్ యూనిట్, యూనిట్ స్థాయిలో ప్రారంభమైంది. వివిధ స్థాయిలలో శిక్షణ, ఎంపికల తర్వాత ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మూడు ఎన్‌సీసీ విభాగాల నుండి చివరికి 121 మంది క్యాడెట్‌లు ఎన్‌సీసీకి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. జాతీయ వేదికపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ రిపబ్లిక్ డే క్యాంప్ అనేది ఒక క్యాడెట్‌కు జీవితాన్ని మార్చే అనుభవం. 

సికింద్రాబాద్ జాతీయ వేదికపై గణతంత్ర దినోత్సవం రోజు పాల్గొనడం ఒక్కో ఎన్‌సీసీ విద్యార్థికి జీవితాన్నే మార్చే అనుభవాన్ని, జీవితాంతం గుర్తుంచుకునే మదురజ్ఞాపకాలను ఇస్తుందని తెలంగాణ ఆంధ్ర ఎన్‌సీసీ డీడీజీ పి.మహేశ్వర్ తెలిపారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఢిల్లీలో 30 రోజుల పాటు జరిగిన శిబిరంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని సికింద్రాబాద్ కు తిరిగి వచ్చిన తెలుగు రాష్ట్రాల ఎన్‌సీసీ విద్యార్థులతో పాటు అధికారులను డీడీజీ మహేశ్వర్ అభినందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుండి మొత్తం లక్షా 21 వేల మంది ఎన్‌సీసీ విద్యార్థులు శిక్షణ పొందుతుండగా  అందులో కేవలం 121 మందికి మాత్రమే పరేడ్ లో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 28 రాష్ట్రాల నుండి పాల్గొన్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ జీపీ హెడ్ క్వార్టర్స్ చెందిన ఎస్‌జీటీ జి.ప్రేమ్ కృతిక ఎస్‌డబ్ల్యూ విభాగంలో ఉత్తమ క్యాడేట్ గా ఎంపికై డైరెక్టరేట్ కె గర్వకారణంగా నిలిచిందని వెల్లడించారు.

Published at : 02 Feb 2023 08:16 PM (IST) Tags: Republic Day Celebrations 2023 Republic Day 2023 Telangana Cadets AP Cadets Republic Day Camp

సంబంధిత కథనాలు

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్