అన్వేషించండి

AP 10th Supplementary Exams: జూన్ 2 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ విడుదల

AP 10th Supplementary Exams: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ రెండో తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

AP 10th Supplementary Exams: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభత్వ పరీక్షల విభాగం టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసే వాళ్లు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 2వ తేదీన తెలుగు, 3వ తేదీన హిందీ, 5వ తేదీన ఇంగ్లీష్, 6వ తేదీన గణితం, 7వ తేదీన సైన్స్, 8వ తేదీన సాంఘీక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని వివరించింది. కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1, 10వ తేదీన ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని పేర్కంది. 

ఇటీవలే విడుదలైన పదో తరగతి రిజల్ట్స్..!

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు ఇటీవలే విడుదల అయ్యాయి. అమరావతిలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మే 6వ తేదీన ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలో ఫలితాలను పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించారు. గతేడాది తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా లీక్ సమస్య లేకుండా ఆదేశాలు జారీ చేశారు. 

38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు..

6,64,152 మంది రాసిన పదో తరగతి పరీక్ష పేపర్‌లను ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఆలంటి తప్పులకు అవకాశం లేకుండా చూసుకుంది. వాల్యుయేషన్ పక్కగా నిర్వహించామని చెబుతోంది. 
2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్‌ పెరిగింది. అది 3.47 శాతం గా ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్‌ పర్సంటేజ్‌ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్‌ 60.39శాతం. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 938 స్కూల్స్‌ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్‌ ఉంటే...  2,95,807 మంది బాలికలు ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget