Top Headlines Today: కువైట్ బాధితుడికి లోకేశ్ భరోసా, ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న రేవంత్ - నేటి టాప్ న్యూస్
Telugu News Today on 14 July 2024: కువైట్ బాధితుడి వైరల్ వీడియోపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్ అతడికి సాయం చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Nara Lokesh News | కువైట్ బాధితుడికి లోకేశ్ భరోసా - వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన కార్మికుడి వీడియో తాజాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ బాధితుడు తన దీన పరిస్థితిని వెల్లడిస్తూ ఓ సెల్ఫీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో ఆ వీడియో విపరీతంగా షేర్ అయింది. కువైట్‌లోని ఓ ఎడారి ప్రాంతంలో ఆ వ్యక్తి తాను పడుతున్న వేదనను ఆ సెల్ఫీ వీడియోలో వివరించాడు. దీంతో కువైట్‌లో వేధింపులకు గురైన కార్మికుడి వీడియోపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం - కాన్వాయ్ ఆపి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి సవిత
గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తోన్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించి.. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అరుణాచలానికి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు, ఈ జిల్లాల నుంచి నేరుగా
తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త! భక్తుల అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు బస్సుల వివరాలను వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నెల 21న గురు పౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న రేవంత్ - ఈ రాజకీయం వెనుక వ్యూహమేంటి ?
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ లేకుండా వ్యవహరిస్తున్నారని ఎవరు వస్తే వారికి కండువా కప్పుతున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే రోజుకో ఎమ్మెల్యే చొప్పున వచ్చి పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పారు. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. నిజానికి ఇద్దర్నీ ఒక్క సారే చేర్చుకోవచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాలినడకన తిరుమలకు అమరావతి రైతులు, రేపు శ్రీవారి దర్శనం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి పునర్ వైభవానికి మార్గం సుగమం కావడంతో రాజధాని ప్రాంత రైతులు తమ మొక్కు తీర్చుకున్నారు. అమరావతి రైతులు కృతజ్ఞత పాదయాత్ర రూపంలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడకమార్గం నుంచి తిరుమలకు వెళ్లారు. గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి వీరంతా కలిసి పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 30 మంది రైతులు గత 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి