(Source: ECI/ABP News/ABP Majha)
Mudragada On Pawan : ద్వారంపూడిని వెనుకేసుకొచ్చిన ముద్రగడ- పవన్ తీరును తప్పుబడుతూ ఓపెన్ లెటర్
Mudragada On Pawan : పార్టీ పెట్టి పదిమంది చేత మెప్పు పొందాలే కానీ.. ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఎంత వరకు సమంజసం అంటూ పవన్ కల్యాణ్‌ను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.
Mudragada On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. పార్టీ పెట్టి పది మంది ప్రేమ పొందాలే కానీ.. ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారంటూ పవన్ కల్యామ్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఫైట్ చేశానని చెప్పుకొచ్చారు. నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టి సారించాలని లేఖలో హితవు పలికారు. తాను కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకుడిగా ఎదగలేదన్నారు. తాను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారినప్పడుల్లా తాను ఉద్యమాలు చేయలేదన్నారు. పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తామనని చంద్రబాబు నాయుడి పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చామన్నారు. ఈ పరిస్థితిని బాబు ద్వారా పవన్ కల్పించారని ఆరోపించారు. తాను ఏ నాయకుడినీ బెదిరించి డబ్బులు సంపాదించలేదని చెప్పారు.
ఎమ్మెల్యేని తిట్టడం ఆపేసి.. ఆ సమస్యలపై దృష్టి పెట్టండి!
తన కంటే చాలా బలవంతుడైన పవన్ కల్యాణ్ తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు. ఎమ్మెల్యేని తిట్టడం ఆపేసి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వగైరా సమస్యలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. జనసేనానికి నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్ధం చేయండంటూ కోరారు. తన లాంటి అనాథల మీద విమర్శలు చేయడం సరికాదని సూచించారు.
పార్టీ పెట్టిన తర్వాత పదిమంది ప్రేమ పొందాలే కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంత వరకూ న్యాయమంటారని అడిగారు. అలాగే రాజకీయాల్లో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కోవాలని... ఉద్యామాలకు అయితే ఎవరి ఇంటికి వెళ్లి సాయం చేయాలని అడగాల్సిన అవసరం లేదన్నారు. మనం చేసే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉన్నారని తెలిపారు.
Also Read: పవన్ స్పీచ్ చంద్రబాబు స్క్రిప్టే, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం - అంబటి కౌంటర్
ఎంత మందిని చెప్పుతో కొట్టారో, ఎంత మందికి గుండ్లు కొట్టించారో చెప్పాలి..?
పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో పదే పదే.. తొక్క తీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, గుండు గీయిస్తా అంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఇలా ఎంత మందిని కొట్టారో, ఎంత మందికి గుండు గీయించి, కింద కూర్బోబెట్టారో చెప్పాలని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి, తాతది తప్పుడు మార్గాల్లో సంపాదన అనే మాట చాలా తప్పు అని అన్నారు. ద్వారంపూడిపై గెలిచి పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో చూపించాలని అన్నారు.
Join Us on Telegram:https://t.me/abpdesamofficial