అన్వేషించండి

Top Headlines Today: ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీంలో గట్టి షాక్!, తనకు ఏ ఫాం హౌస్ లేదన్న కేటీఆర్ - నేటి టాప్ న్యూస్

Telangana News Today | తెలంగాణ హైకోర్టు జన్వాడ ఫాం హౌస్ రేపటి వరకు కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ టాప్ 5 హెడ్ లైన్స్ ఒకేచోట చదివేయండి.

Andhra Pradesh News - నాకు ఏ ఫాం హౌస్ లేదు- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫాం హౌస్‌లు చెక్ చేద్దామా? కేటీఆర్ ఛాలెంజ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు ఫాం ఫౌస్‌లు ఉన్నాయని, తనకు ఏ ఫాం హౌస్ లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్నేహితుడి ఫాం హౌస్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. తెలంగాణలో నిబంధనలు పాటించకుండా కట్టిన ఫాం హౌస్ లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు మీద ఏ ఫాం హౌస్ లేదని, తనకు అసలు ఫాం హౌస్ లేదని క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీంలో గట్టి షాక్! తీవ్రంగా మందలించిన ధర్మాసనం
తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ.. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేయడమే కాకుండా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డిని కూడా మందలించింది. ఆ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

వరంగల్ బీఆర్‌ఎస్‌లో డిష్యూం డిష్యూం- ఒకరు కేసీఆర్‌కు సన్నిహితులు మరొకరు కేటీఆర్‌ ఫ్రెండ్‌
అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కలకలం రేపుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు బీఅర్ ఎస్ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఒకరు ఎమ్మెల్సీ అయితే... మరొకరు ఎమ్మెల్యే. అంతేకాదు ఇద్దరిలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు అత్యంత సన్నిహితులైతే, ఎమ్మెల్సీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్లోజ్‌. మిత్రుడు కూడా. అయితే జనగామ నియోజకవర్గంలో పాగా వేయడం కోసం వీరిద్దరి మధ్య ఆధిపత్యం పోరుకు దారితీస్తుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

తాడిపత్రిలోనే ఉంటా - పోరాటం చేస్తుంటా- పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ 
తాడిపత్రిలో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినప్పటికీ భవిష్యత్‌లో ఎప్పుడైనా మరోసారి ఘర్షణలు జరిగే ప్రమాదం లేకపోలేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన కామెంట్స్‌ అందుకు సాక్ష్యంగా మారుతున్నాయి. తాను కచ్చితంగా తాడిపత్రిలోనే ఉంటానంటున్న వైసీపీ నేత... జేసీ అరాచకాలపై పోరాటం కొనసాగిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల అనంతరం చాలా కాలం తర్వాత తొలిసారి పెద్దారెడ్డి తాడిపత్రి రావడంతో ఒక్కసారి ఆ ప్రాంతం భగ్గమంది. ఆ ప్రాంతంలోకి పెద్దారెడ్డి వస్తే ఘర్షణలు తలెత్తి ప్రమాదం ఉందని చెప్పినా ఆయన రావడంతో టీడీపీ వర్గీయులు తిరుగుబాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో విచారణ- రేపటి వరకు కూల్చివేతలొద్దని ఆదేశం
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు రేపటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దని చెప్పింది. హైడ్రా విధివిధానాలను ప్రశ్నించింది. అయితే జీవో నెంబర్‌ 111 ఈ హైడ్రా పరిధిలోకి రాదని అడ్వకేట్‌ జనరల్ కోర్టుకు చెప్పారు. జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చొద్దని వేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Embed widget