Top Headlines Today: వైజాగ్ మెట్రో రైలుపై మంత్రి నారాయణ కీలక ప్రకటన- బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News Today: వైజాగ్‌కు మెట్రో రైలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి తీరుతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Telangana News Today | నాలుగు కారిడార్లు, రెండు ఫేజ్‌లు- వైజాగ్ మెట్రో రైలుపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
వైజాగ్‌కు మెట్రో రైలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి తీరుతామంటున్నారు మంత్రి నారాయణ. ఈరోజు అసెంబ్లీలో వైజాగ్ టిడిపి ఎమ్మెల్యేల నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి)సిద్దం చేసినట్లు నారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్‌పై ముందుకెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నాలకు మంత్రి సమాధానమిచ్చారు. పూర్తి వివరాలు
జగన్‌కు బైబై చెప్పేసిన దొమ్మేరు జమిందార్ అల్లుడు- గోదావరి జిల్లాల్లో వైసీపీకి బిగ్ షాక్
పారిశ్రామికవేత్త రాజీవ్ కృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజీవ్ కృష్ణ అంటే ఎలైట్ వర్గంలోనే పేరు కానీ... కృష్ణ బాబు అల్లుడు అంటే రాష్ట్ర మొత్తం తెలిసిపోతుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు గోదావరి జిల్లాల రాజకీయాన్ని శాసించిన దొమ్మేరు జమిందార్ పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణ బాబు కుటుంబం గురించి రాజకీయాల్లో తెలియనివాళ్లు లేరు. ప్రస్తుతం కృష్ణ బాబు వారసుడిగా రాజీవ్ కృష్ణ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. పూర్తి వివరాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ట్యాపింగ్ కేసును వెలుగులోకి తెచ్చి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఉన్నట్లుండి విచారణ కాస్త నెమ్మదించినట్లు కనిపించింది. ఇటీవల కాలంలో ఊహించిన స్థాయిలో ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు. పూర్తి వివరాలు
బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో అధికారులపై దాడి చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఉన్న అనుమానిస్తున్న పోలీసులు ఆయన్ని ఈ ఉదయం అరెస్టు చేశారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన నరేందర్ రెడ్డిని ఫిలింనగర్‌లో అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లి వస్తున్న పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన సోషల్ యాక్టివిస్టులను అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ విమర్సలు చేస్తోంది. ఈ వివాదంలో మూకుమ్మడిగా అరెస్టులు చేస్తున్నారని విజయబాబు అనే పిటిషన్ పిల్ వేశారు. పిల్‌ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు