అన్వేషించండి

Telngana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం- 14న విచారణకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!

Phone Tapping Case In Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అన్నట్లు విచారణ మరోసారి స్పీడ్ అందుకుంది. మాజీ ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు అందుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది.

Telangana News: సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ట్యాపింగ్ కేసును వెలుగులోకి తెచ్చి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఉన్నట్లుండి విచారణ కాస్త నెమ్మదించినట్లు కనిపించింది. ఇటీవల కాలంలో ఊహించిన స్థాయిలో ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకోకపోవడంతో ఇంక ట్యాపింగ్ కథ కంచికే అని అంతా అనుకున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు అందుకోవడంతో తెలంగాణ రాజకీయాలకు ట్యాపింగ్ అగ్గి మళ్లీ రాజుకున్నట్టైంది. 

చార్జిషీటు దాఖలు చేసినా నాలుగు నెలల తర్వాత ఈ కేసులో మొదటిసారి రాజకీయ నాయకులను పోలీసులు టచ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు ఫోన్ టైపింగ్ కేసుతో ఉన్న సంబంధాలపై సర్వత్ర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసు అధికారులను మాత్రమే అరెస్టు చేశారు. ఇప్పటికే మరో ఇద్దరు విదేశాల్లో తలదాచుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు పోలీసుల ముందుకు వచ్చి సహకరిస్తేనే మరి కొందరు రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉందని, అప్పుడే రాజకీయ నేతలను పోలీసులు విచారణకు పిలుస్తారని వాదన. కానీ అనుహ్యాoగా ఆ ఇద్దరు విదేశాల్లోనే ఉన్నప్పటికీ పోలీసులు పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఫోన్ టాపింగ్ కేసులో అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ రెండో వారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొనట్టలు తెలుస్తోంది. ఇప్పటికే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే టాపింగ్ కేసు విచారణ సందర్భంగా అప్పటి ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును సీజ్ చేసే విషయంలో ఇప్పుడు అరెస్టు అయిన పోలీసుల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. వీటితోపాటు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పోలీస్ వాహనాల్లో డబ్బులు సైతం వెళ్ళినట్లు చార్జిషీట్లోనూ దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యేలే పోలీసుల సహాయంతో డబ్బుల సంచులను ఎన్నికలకు తరలించినట్టు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

Also Read: ముఖ్య నేతల ఢిల్లీ టూర్లు పూర్తి - ఇక తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయా ?

మాజీ ఎమ్మెల్యేల  స్టేట్‌మెంట్ రికార్డ్‌తోపాటు ట్యాపింగ్ వ్యవహారంలో వారి పాత్రపైనా పోలీసులు విచారించాల్సిన ఉంది. అందులో భాగంగానే వీరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. నవంబర్‌ 14వ తేదీన చిరుముర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరుకానున్నారని తెలుస్తోంది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలతోపాటు సెలబ్రెటీలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రరాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోగా,ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తాజాగా నోటీసులందుకున్న మాజీ ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారనేది సర్వత్రా ఆశక్తిగా మారింది. ఎమ్మెల్యేల విచారణ తరువాత ఈ కేసులో ఇంకా ఎంతమంది పేర్లు బయటపడతాయో, అందులో కీలక నేతల పేర్లు ఉంటే కేసు కొత్త మలుపు తిరగడమేకాదు, ఆయా రాజకీయ పార్టీల ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం లేకపోలేదు. 

Also Read: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget