అన్వేషించండి

Vasuki Indicus Snake: 4.7 కోట్ల ఏళ్ల నాటి భారీ పాముకి వాసుకి పేరు ఎందుకు పెట్టారు?

Vasuki Indicus: 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము శిలాజాలను గుజరాత్‌లోని బొగ్గు గనిలో 2005లో గుర్తించారు.

Vasuki Indicus Snake: 2005లో గుజరాత్‌లో గుర్తించిన పాము శిలాజాల గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ భూమిపైన తిరిగిన అత్యంత భారీ పాము ఇదేనని తేల్చిచెప్పారు. దీనికి Vasuki indicus అనే పేరు కూడా పెట్టారు. 4.7 కోట్ల సంవత్సరాల క్రితం (47 million years snake) ఈ పాము జీవించిందని కచ్‌ అడవుల్లో సంచరించిందని తెలిపారు. ఈ పాము పొడవు 36-50 అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు. అంతరించిపోయిన Titanoboa జాతి పాములకు ఈ వాసుకి ఇండికస్‌కి తరవాతి తరం పాములు అయ్యుంటాయని అభిప్రాయపడుతున్నారు. దీని పొడవు 42 అడుగుల కన్నా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. వెయ్యి కిలోల బరువు ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బతికున్న పాము పైథాన్. దీని పొడవు 33 అడుగులు. శిలాజాల ఆధారంగా ఇది చాలా నెమ్మదిగా కదిలేదని గుర్తించారు. అనకొండ, పైథాన్స్‌లాగానే ఈ పాములు కూడా క్షణాల్లో వేటాడి తినేవని వివరించారు. ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఆ సమయంలో చిత్తడి నేలల్లో చల్లదనం కోసం ఈ పాము తిరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే...హిందూ పురాణాల ప్రకారం శివుని మెడలో (Vasuki Snake) ఉన్న పాము పేరు వాసుకి. అందుకే ఈ అరుదైన పాముకి ఆ పేరు పెట్టారు. వాసుకి అంటే పాములకు రారాజు. అది చాలా భారీగా ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు గుర్తించిన పాము కూడా భారీగా ఉండడం వల్ల అదే పేరు పెట్టారు. 

Vasuki Indicus Snake: 4.7 కోట్ల ఏళ్ల నాటి భారీ పాముకి వాసుకి పేరు ఎందుకు పెట్టారు?

దాదాపు 20 ఏళ్లుగా ల్యాబ్‌లోనే 

ఈ వాసుకి ఇండికస్ పాము శిలాజాలను  IIT-Roorkee paleontology ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్ కనుగొన్నారు. 2005లో ఓ కచ్‌లోని బొగ్గు గనిలో వీటిని గుర్తించారు. అయితే...ముందు వాటిని మొసలి శిలాజాలుగా భావించారు సునీల్. ఆయన తన లేబరేటరీలో పరిశోధన చేసేందుకు 2022 వరకూ అక్కడే ఉంచారు. ఆ తరవాత దత్త అనే మరో సైంటిస్ట్‌ ఆ ల్యాబ్‌లో పని చేసేందుకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఈ శిలాజాలపై పరిశోధన చేపట్టారు. అప్పుడే ఇది మొసలి శిలాజాలు కావని, మరింకేదో అని గుర్తించారు. Titanoboa పాముకి దగ్గరి పోలికలు కనిపించినట్టు తెలిపారు. రెండింటి ఆకారంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ఆ జాతికి కొనసాగింపుగానే ఈ పాములు పుట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. 

"2005లో నేనీ శిలాజాలను గుర్తించాను. కానీ అప్పటి నుంచి నేను ఇతరత్రా పరిశోధనలతో బిజీగా ఉన్నాను. చాలా కాలంపాటు అధ్యయనం చేసిన ఆ తరవాత ఆపేశాను. 2022లో దత్త వచ్చిన తరవాత ఇద్దరం కలిసి మళ్లీ పరిశోధనలు మొదలు పెట్టాం. ముందు ఇది మొసలి శిలాజాలు అని భావించినా ఆ తరవాతే ఇవి పాము శిలాజాలు అని గుర్తించాం. ఈ భూమిపైనే అత్యంత భారీ పాము శిలాజాలు అని తేలింది. అందుకే వాసుకీ ఇండికస్ అనే పేరు పెట్టాం"

- సునీలా బాజ్‌పాయ్‌, పరిశోధకుడు 

Also Read: మెక్‌డొనాల్డ్స్‌ ఉద్యోగిపై కస్టమర్ దాడి,ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalki 2898 AD Twitter Review - కల్కి 2898 ఏడీ ఆడియన్స్ రివ్యూ: Mahabharat ఎపిసోడ్, ఫస్ట్ ఫైట్‌తోనే వందకు 100 - Prabhas సినిమా టాక్ ఎలా ఉందంటే?
కల్కి 2898 ఏడీ ఆడియన్స్ రివ్యూ: Mahabharat ఎపిసోడ్, ఫస్ట్ ఫైట్‌తోనే వందకు 100 - Prabhas సినిమా టాక్ ఎలా ఉందంటే?
Lal Krishna Advani: ఎల్కే అద్వానీకి అనారోగ్యం-ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
ఎల్కే అద్వానీకి అనారోగ్యం-ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
Srikakulam News: నా భార్యను నాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న భర్త ఆవేదన
నా భార్యను నాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న భర్త ఆవేదన
Kalki 2898 AD OTT: Prabhas 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్, మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అందులోనే!
Prabhas 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్, మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అందులోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalki 2898 AD Twitter Review - కల్కి 2898 ఏడీ ఆడియన్స్ రివ్యూ: Mahabharat ఎపిసోడ్, ఫస్ట్ ఫైట్‌తోనే వందకు 100 - Prabhas సినిమా టాక్ ఎలా ఉందంటే?
కల్కి 2898 ఏడీ ఆడియన్స్ రివ్యూ: Mahabharat ఎపిసోడ్, ఫస్ట్ ఫైట్‌తోనే వందకు 100 - Prabhas సినిమా టాక్ ఎలా ఉందంటే?
Lal Krishna Advani: ఎల్కే అద్వానీకి అనారోగ్యం-ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
ఎల్కే అద్వానీకి అనారోగ్యం-ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
Srikakulam News: నా భార్యను నాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న భర్త ఆవేదన
నా భార్యను నాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న భర్త ఆవేదన
Kalki 2898 AD OTT: Prabhas 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్, మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అందులోనే!
Prabhas 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్, మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అందులోనే!
AP High Court: పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన YSRCP
SA vs Afg Semifinal 1 Preview: సౌతాఫ్రికా సల్లగా ఆడితే అఫ్గాన్లు కాబూలీ పలావ్ తినిపిస్తారు! మొదటి యుద్ధం గెలిచేదెవరో
సౌతాఫ్రికా సల్లగా ఆడితే అఫ్గాన్లు కాబూలీ పలావ్ తినిపిస్తారు! మొదటి యుద్ధం గెలిచేదెవరో
ABP Network: ఏబీపీ ప్రీమియం సర్వీస్ లాంఛ్ చేసిన ఏబీపీ నెట్‌వర్క్, ఇకపై ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అన్‌లిమిటెడ్
ఏబీపీ ప్రీమియం సర్వీస్ లాంఛ్ చేసిన ఏబీపీ నెట్‌వర్క్, ఇకపై ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అన్‌లిమిటెడ్
Rajamouli: మరోసారి ఆస్కార్ నుంచి ‘RRR’ టీమ్‌కు పిలుపు - స్వయంగా ప్రకటించిన రాజమౌళి
మరోసారి ఆస్కార్ నుంచి ‘RRR’ టీమ్‌కు పిలుపు - స్వయంగా ప్రకటించిన రాజమౌళి
Embed widget