News
News
X

Amit Shah On Article 370: నెహ్రూ చేసిన తప్పుని ప్రధాని మోదీ సరిదిద్దారు, ఇది మౌనిబాబా ప్రభుత్వం కాదు - అమిత్‌షా

Amit Shah On Article 370: నెహ్రూ ఆర్టికల్ 370 తీసుకురావటం వల్లే కశ్మీర్‌ సమస్యలు ఎదుర్కొందని అమిత్‌షా మండి పడ్డారు.

FOLLOW US: 
 
Amit Shah On Article 370:

ఆయన వల్లే సమస్యలు: అమిత్‌షా

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని మూడేళ్ల క్రితం రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్ణయాన్ని అంతా ప్రశంసించినా...- ఇప్పటికీ కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్‌లోని స్థానిక పార్టీలు అసహనంగా ఉన్నాయి. కేంద్రం మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించామని స్పష్టం చేసింది. అయితే...అంతటితో ఆగకుండా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు వల్లే ఇన్నేళ్ల పాటు ఈ సమస్య అలా నలుగుతూ వచ్చిందని భాజపా కాస్త గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు మరోసారి కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. "కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని అప్పట్లో నెహ్రూ తీసుకురావటం వల్లే అక్కడ అన్ని సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిష్కరించారు" అని వ్యాఖ్యానించారు. నెహ్రూ చేసిన తప్పుని ప్రధాని మోదీ సరిదిద్దారని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గౌరవ్‌ యాత్రలో పాల్గొన్న అమిత్‌షా...అయోధ్యలో రామమందిరంపైనా ఎన్నో విమర్శలు చేశారని, కానీ ఇప్పుడది ప్రస్తుతం అక్కడ పనులు వేగంగా కొనసాగుతుండటాన్ని గమనించాలని అన్నారు. "ఆర్టికల్ 370 ని తీసుకొచ్చి నెహ్రూ తప్పు చేశారు. అప్పటి నుంచి కశ్మీర్‌ సమస్యలతో సతమతమవుతోంది. దేశంలో కశ్మీర్‌ను విలీనం చేయడానికి అది అడ్డంకిగా మారింది. ఆర్టికల్ 370 రద్దు చేయాలని ప్రజలంతా కోరుకున్నారు. ప్రధాని మోదీ ఒక్క దెబ్బకు దాన్ని తొలగించారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు" అని వెల్లడించారు. 

ఆలయం నిర్మిస్తున్నాం: షా 

News Reels

అమిత్‌షా మాత్రమే కాదు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని గత వారం గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో చెప్పారు. నెహ్రూ కారణంగానే కశ్మీర్‌లో సమస్యలు తలెత్తాయని అన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణాన్నీ కాంగ్రెస్ అపహాస్యం చేసిందని అమిత్‌షా మండి పడ్డారు. "ఆలయం అక్కడే కడతారు. కానీ ఎప్పుడో తెలియదు" అని భాజపా లక్ష్యాన్ని ఎద్దేవా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ....ఈ నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయని హామీ ఇచ్చిన విధంగానే, ఆ చోటే అట్టహాసంగా ఆలయం తయారవుతోందని స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రాలకు మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. "సోమ్‌నాథ్, ద్వారకా, కాశీ, కేదార్‌నాథ్..ఎక్కడికైనా వెళ్లండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలయాలను ఎంతగా అభివృద్ధి చేసిందో అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి" అని చెప్పారు అమిత్‌షా. అటు ఉగ్రవాదం విషయంలోనూ ప్రధాని మోదీ ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారని, సర్జికల్ స్ట్రైక్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు. "యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్థాన్ మన భూభాగంలోకి వచ్చి సైనికుల తలలు తీసుకెళ్లేది. మా ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడూ అదే చేద్దామని పాక్ ప్రయత్నించింది. కానీ..ఇది మౌనిబాబా (మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ ) 
ప్రభుత్వం కాదని వాళ్లకు అర్థం కాలేదు. అలా ఉగ్రదాడులు జరిగిన వెంటనే మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్‌తో బదులు చెప్పింది" అని అన్నారు. 

Also Read: Rahul Gandhi: ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాందీ జోడో యాత్ర, మళ్లీ సాయంత్రం కర్ణాటకలోకి

Published at : 14 Oct 2022 11:18 AM (IST) Tags: PM Modi Amit Shah Kashmir article 370 Nehru Amit Shah On Article 370

సంబంధిత కథనాలు

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

ABP Desam Top 10, 4 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 December 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్