By: Ram Manohar | Updated at : 05 Jan 2023 04:52 PM (IST)
2024 జనవరి 1వ తేదీన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని అమిత్‌షా వెల్లడించారు.
Ayodhya Ram Mandir:
2024 జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ రోజే ఆలయ ప్రారంభోత్సవం జరుపుకుంటామని స్పష్టం చేశారు. త్రిపురలోని ఓ సభలో పాల్గొన్న అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ పదేపదే అయోధ్య రామ మందిరం గురించి అపహాస్యం చేసే వారు. నిర్మాణం అక్కడే జరుగుతుంది కానీ..తేదీ మాత్రం చెప్పరు అని వెటకారం చేసేవారు. ఇప్పుడు చెబుతున్నా. రాహుల్ బాబా శ్రద్ధగా వినండి. చెవులు రిక్కించి వినండి. 2024 జనవరి 1వ తేదీ నాటికి రామ మందిరం తయారవుతుంది" అని వెల్లడించారు. త్రిపురలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అందుకే...ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. ఇందులో భాగంగానే...అమిత్‌షా అక్కడ పర్యటించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న CPIM ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
#WATCH | Congress hindered the construction of Ram Temple in courts...After the SC verdict came, Modiji began the construction of the temple...Ram Temple will be ready on 1st January 2024: Union Home minister Amit Shah in Tripura pic.twitter.com/d7lZ8eegwS
— ANI (@ANI) January 5, 2023
మసీదు నిర్మాణం..
ఈ ఆలయంతో పాటు మసీదు నిర్మాణ కూడా అదే గడువులోగా పూర్తవుతుందని ట్రస్ట్ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. Indo Islamic Cultural Foundation Trustకు చెందిన ఓ సీనియర్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంటే...రాముడి ఆలయంతో పాటు మసీదు కూడా ఒకేసారి పూర్తవుతుందన్నమాట. ఇదే జరిగితే...అది చరిత్రాత్మకం అవుతుందని అంటున్నారు. రామ్ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ముస్లింలకు చెందిన స్థలంలో కచ్చితంగా మసీదు నిర్మించాలని ఆదేశించింది. ముస్లింలు వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ తీర్పునిచ్చింది. యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మసీదు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ట్రస్ట్ సెక్రటరీ అధర్ హుస్సేన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. "మసీదు, హాస్పిటల్, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు సంబంధించిన మ్యాప్‌ను ఈ నెలాఖరులోగా అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ మాకు అందిస్తుందన్న నమ్మకముంది" అని అన్నారు. ఆ మ్యాప్ రాగానే మసీదుతో పాటు మిగతా నిర్మాణాల పనులు మొదలు పెడతామని వెల్లడించారు. ఈ మసీదు పేరు "ధనిపూర్ అయోధ్య మసీద్"గా నిర్ధరించున్నట్టు చెప్పారు. మిగతా నిర్మాణాలున్న కాంప్లెక్స్ పేరుని "మౌల్వి అహ్మదుల్లా షా కాంప్లెక్స్"గా పెట్టాలని భావిస్తున్నామని వివరించారు.
Also Read: Covid-19 In India: భారత్‌లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో గుర్తించిన కేంద్రం
Telangana Budget 2023: రూ.3 వేల నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు?: ఎంపీ సోయం బాపూరావు
Rat Steals Necklace : డైమండ్ నెక్లెస్ చోరీచేసిన ఎలుక, ప్రియురాలికి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్
SSC Exams: సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన - ఆసిఫాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తం!
Turkey Earthquake : టర్కీ భూకంపాన్ని ముందుగా పసిగట్టిన పక్షులు, వీడియో వైరల్!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!