Covid-19 In India: భారత్‌లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో గుర్తించిన కేంద్రం
Covid-19 In India: ఇండియాలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తించారు.
New Variants in India:
భారత్‌లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. విదేశీ ప్రయాణికులను పరీక్షించగా ఇది వెల్లడైంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 3వ తేదీ మధ్య కాలంలో టెస్ట్‌లు చేయగా...ఈ వేరియంట్లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ పదిరోజుల్లో మొత్తం 19,277 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 124 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ శాంపిల్స్‌లో 40 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. వీటిలో 14 శాంపిల్స్‌లో XBB వేరియంట్ కనిపించింది. మిగతా కొన్ని నమూనాల్లో XBB.1, BF.7 వేరియంట్లనూ గుర్తించారు. ఈ ఫలితాలు రాకముందు రోజు ఐదుగురు XBB.1.5 వేరియంట్ బారిన పడ్డారు. ఈ వేరియంట్ కారణంగానే...అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు భారత్‌లోనూ ఈ వేరియంట్ వెలుగులోకి రావడం కలవర పెడుతోంది. ఈ ఐదుగురిలో ముగ్గురు గుజరాత్‌కు చెందిన వాళ్లే. రాజస్థాన్‌లో ఒకరికి, కర్ణాటకలో ఒకరికి ఇదే వేరియంట్ సోకింది.
11 Covid-19 Omicron Sub-variants have been found in international passengers between 24th Dec-3rd Jan during testing at International airports & seaports. Total of 19,227 samples tested out of which 124 international travellers were found positive & were isolated:Official Sources
— ANI (@ANI) January 5, 2023
అమెరికాలో కొత్త వేరియంట్..
ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్లు ఇలా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వైరాలజిస్ట్ ఎరిక్..ఈ విషయం వెల్లడించారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ట్విటర్ వేదికగా చెప్పారు. "కరోనా కొత్త వేరియంట్ XBB15 అమెరికాలో వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌తో అగ్రరాజ్యంలో మళ్లీ విధ్వంసం చూస్తాం" అని హెచ్చరించారు. గత వేరియంట్లతో పోల్చి చూస్తే 120% అధిక వేగంతో ఇది వ్యాప్తి చెందుతుందని అంచనా వేశారు. యూకేలో XBB15 వేరియంట్ వ్యాప్తి వారం రోజుల్లోనే 0-4.3%కి పెరిగిందని ఎరిక్ వెల్లడించారు. మరో వారం రోజుల్లో 10% కి అధికమ వుతుందని అన్నారు. ఇదే తరహాలో... అమెరికాలోనూ తీవ్రంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీతో ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన ఎరిక్ ఈ హెచ్చరికలు చేయడం సంచలనమవుతోంది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణానికి ముందు వారు తమ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. కరోనా కేసులు విదేశాల్లో మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. రెండు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో ముందు నుంచే నివారణ చర్యలు చేపట్టింది. పౌరులంతా మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న 40రోజులు భారత్ కు కీలకమని కేంద్రం ఇటీవలే వెల్లడించింది.