US Scary Life: అమెరికా కన్నా గల్ప్ బెటర్ - భారత యువతకు నరకంగా అగ్రరాజ్యం !
US: అమెరికా రాను రాను భారత యువతకు నరకంగా మారుతోంది. అవకాశాలు రూ. కోటి ఖర్చు పెట్టుకుని తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
America is becoming hell for Indian youth: "అమెరికాకు చదువుకునేందుకు ఎవరైనా రావొచ్చు. కానీ అక్కడే ఉద్యోగాలు మాత్రం దొరకవు.ఇండియాకు వచ్చి గొప్పగా ఎదగాలి" అని హైదరాబాద్‌లోని అమెరికా హైకమిషన్ ఉన్నతాధికారి స్పష్టంగా చెప్పారు. ఏటికేడు లక్షల మంది భారతీయులు ముఖ్యంగా ఏపీ నుంచి యువత చదువు పేరుతో అమెరికాకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు రూ. యాభై లక్షల నుంచి కోటి వరకూ ఖర్చు పెడుతున్నారు. అమెరికాకు వారు ఆదాయం తెచ్చి పెడుతున్నారు.అందుకే ఆహ్వానిస్తున్నారు. కానీ ఉద్యోగవకాశాలు మాత్రం కల్పించేందుకు అమెరికా రెడీగా లేదు.
చదువు పూర్తయిన వారికి దొరకని ఉద్యోగాలు
అమెరికాలో ఎంఎస్చేయడానికి వెళ్లిన వారి లక్ష్యం చదువు కాదు.. అక్కడ చదువుకుంటూనే ఉద్యోగం సాధించడం లక్ష్యం. గతంలో ఇలా అమెరికా వెళ్లిన వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇప్పటికే ఉన్న వారికి సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి కానీ కొత్త ఉద్యోగాలు రావడం లేదు. దీంతో చదువు అయిపోవడంతో చాలా మంది వెనక్కి తిరిగి రావాల్సి వస్తోంది. అంటే రూ.కోటి వరకూ ఖర్చుపెట్టుకుని అమరికాలో చదువుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఊహించడం కష్టం. ఇప్పుడు అదే జరుగుతోంది.
Also Read: TANAలో 30 కోట్ల గోల్ మాల్ - కోశాధికారే కొట్టేశారు - ప్రవాసాంధ్రుల పరువు పోయినట్లే !
పార్టుటైమ్ జాబ్స్ కూడా దొరకని పరిస్థితి
అత్యధిక మంది తమ ఖర్చుల కోసం అయినా పెట్రోల్ బంకుల్లో, సూపర్ మార్కెట్లలో పని చేసి సంపాదించుకోవాలని అనుకుంటారు.ఇప్పుడు అలాంటి పార్ట్ టైమ్ అవకాశాలు కూడా దక్కడం లేదు. చివరికి బేబి సిట్టర్లుగా కూడా కూర్చునేందుకు వెళ్తున్నారు.కొన్ని రోజులు పోతే ఆ అవకాశాలు కూడా దక్కడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. అమెరికాలో అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్నది పెద్దగా పేరు లేని యూనివర్శిటీల్లోనే.పేరున్న యూనివర్శిటీల్లో సీటు వస్తే సమస్య ఉండదు కానీ..డబ్బు కోసమే నడిచే యూనివర్శిటీలు పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న వారి పరిస్థితి ఘోరంగా ఉంది.
వచ్చే జనవరికి పెద్ద ఎత్తున వెనక్కి భారతీయ యువత
డిసెంబర్, జనవరి నెల నుంచి అమెరికా రిటర్నీలు రెట్టింపు అవుతారు. వీసా రెన్యూవల్ కోసం ఇండియాకు వస్తున్న ప్రవాసులకు రెన్యూవల్ అవుతుందో లేదో చెప్పడం కష్టమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హెచ్ వన్ బీ వీసాల్లో లాటరీ తగిలినా దానికి తగ్గ జాబ్ లేకపోతే ఉండవనివ్వడం లేదు. ఈ కారణంగా అమెరికాలో ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఘోరంగా పరిస్థితులు దిగజారిపోతున్నాయి.
అమెరికా రావొద్దని సలహాలిస్తున్న ప్రవాసులు
చదువు పేరుతో అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వారు ఇప్పుడల్లా అమెరికా రావొద్దని ఎక్కువ మంది సలహాలిస్తున్నారు. ఎంఎస్ చేయడానికి వచ్చే వారు మళ్లీ తిరిగి వెళ్లేందుకు సిద్దపడితేనే రావాలని సలహాలిస్తున్నారు.ఒకటి రెండేళ్లలో అమెరికా కంటే గల్ఫ్ కు వెళ్లడమే మంచిదదని అనుకునే పరిస్థితి వస్తుందని అంటున్నారు